'గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః' మనం చిన్నపుడు చదుకున్నదే.. మనం నేర్చుకునే ప్రతి దాంట్లో గురువు ఉంటారు.. విద్య నేర్పే గురువు దేవుడితో సమానం.. మనకు విద్యా బుద్దులు నేర్పే గురువు ఎన్ని సమస్యల్లో ఉన్నా.. తన శిష్యుల ఉన్నతికి ఎంతో కష్టపడుతుంటాడు. అలాంటి గురువుకు సంబందించిన కథే.. ‘నీతోనే నేను’.
టీచర్ గా పని చేసి.. అక్కడి నుండి ఒక సినిమా నిర్మాతగా ఎదిగిన ఎమ్.సుధాకర్ రెడ్డి.. తన నిజ జీవితంలో చూసిన ఘటనలనే ఈ సినిమాగా తెరకెక్కించారు. ఎమ్.సుధాకర్ రెడ్డి శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతగా మారి ఈ సినిమాని తెరకెక్కించగా.. అంజి రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా.. లవ్ స్టోరీనా లేక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానా తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే!
సినిమా కథ:
హీరో రామ్ (వికాస్ వశిష్ట) ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పని చేస్తుంటాడు. ఇతర టీచర్ల మాదిరిగా వచ్చామా..? వెళ్ళామా..? అనికాకుండా.. స్కూల్‌లో పిల్లలు చక్కగా చదువుకుని.. అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. పిల్లలకు మంచి చేయాలన్న హీరో రామ్ నడవడికను చూసి కొంత మంది ఈర్ష్య పడుతుంటే.. మరి కొంతమంది రామ్ ను ఇటపడుతుంటారు. అలా అదే స్కూల్ లో పీటీ టీచర్‌గా పని చేస్తున్న ఆయేషా (కుషిత కళ్లపు) ఇష్టపడుతుంది. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఒక రోజు ఆయేషా.. రామ్ పై ఉన్న ప్రేమను తెలపగా.. తనకు పెళ్లి అయిపోయిందని.. చిన్న నాటి స్నేహితురాలు సీత (మోక్ష)ని పెళ్లిచేసుకున్నట్లు తాం చెపుతాడు. సీతను చూడటానికి రామ్ ఇంటికి వెళ్లిన ఆయేషా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. రామ్ గురించి ఆయేషాకి ఏం తెలిసింది..? సీతకు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి..? రామ్ జీవితంలో ఉన్న సమస్య ఏంటి.. ? స్కూల్‌లోని పిల్లల కోసం రామ్ చేసే పనేంటి.. ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
విశ్లేషణ:
ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు ఉండవు.. కానీ కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్లలకు మళ్లే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా వసతులు ఏర్పరిస్తే.. మంచి ర్యాంకులు సాధిస్తారు అనే అంశాన్ని దర్శకుడు అంజిరామ్ తెరకెక్కించారు. ఈ అంశాన్నే ఆయన తెరకెక్కించిన విషయం బాగుంటుంది. స్కూల్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తూ ఉంటుంది.. అలాగే ఇంటర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మధ్య ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ కొంచెం సాగదీతగా అనిపించినా.. సెకండాఫ్ ట్విస్టులను మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్ విజువల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. నిర్మాత సుధాకర్ రెడ్డి తన పరిధి మేరకు మంచి కమర్షియల్ అంశాలతో సినిమాను రూపొందించారు. కాకపోతే కథ మధ్యలో కమర్షియల్ సాంగ్ పెట్టటం కాస్త పక్కకెళ్లారేమో అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
విద్య వ్యవస్థలపై మరియు గురు దేవో మహేశ్వర అంటూ మన ముందుకు వచ్చిన ‘నీతోనే నేను’ సినిమాలో నటీనటులు మెప్పించారనే చెప్పాలి. "సినిమా బండి"తో మెప్పించిన వికాస్ వశిష్ట ఈ సినిమాలో హీరోగా నటించాడు. వికాస్ వశిష్ట గవర్నమెంట్ టీచర్‌గా, మరోవైపు భార్య కోసం పరితపించే పాత్రలో చక్కగా నటించారు. లుక్ పరంగా కుషిత కళ్లపు చక్కగా కనిపించగా.. మోక్ష ఎమోషనల్ పాత్రలో మెప్పించింది. కన్నింగ్ టీచర్ పాత్రలో ఆకెళ్ల నటన ఆకట్టుకుంది. మొత్తంగా ఒక గవర్నమెంట్ టీచర్, తనకు వ్యక్తిగత జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో చూపించింది నీతోనే నేను.
రేటింగ్: 2.7
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం