Heart Attack Symptoms: గుండెపోటు అనేది ఎప్పుడూ ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చే వ్యాధి కాదనే అంటారు వైద్య నిపుణులు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సాధారణంగా ఎప్పుడూ కొన్ని సంకేతాలు వెలువడుతుంటాయి. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించగలిగితే తక్షణం చికిత్స సాధ్యమౌతుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..
గతంలో అంటే మునుపటికి గుండె పోటు సమస్య అనేది 55 ఏళ్లు దాటాక మాత్రమే వచ్చేది. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారిలో ఈ సమస్య తలెత్తేది. కానీ చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఇప్పుడు గుండెపోటు వ్యాధికి వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. అందుకే సకాలంలో గుండెపోటు లక్షణాలు లేదా సంకేతాలను గుర్తించగలగాలి. ఈ లక్షణాలే భవిష్యత్తులో గుండెపోటు సమస్యను సూచిస్తాయి. ఉదయం లేచిన వెంటనే ఈ 5 లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.
మానసిక ఆరోగ్యం
ఉదయం లేచిన వెంటనే తల బరువుగా ఉన్నట్టు అన్పించడం, భ్రమ, టెన్షన్ లేదా ఆందోళనగా ఉంటే మంచిది కాదు. మీలో గుండెపోటు ముప్పు క్రమక్రమంగా పెరుగుతుందని అర్ధం. ఈ పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు మార్చాలి. హార్ట్ చెకప్ చేయించుకోవాలి.
చెమట అతిగా పట్టడం
ఇంట్లో సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కొద్దిగా చెమట్లు పట్టడం సహజమే. కానీ పడుకునేటప్పుడు రాత్రి ఎక్కువ చెమట్లు పడుతున్నాయంటే ఇది కచ్చితంగా చింతించాల్సిన విషయం. ఈ పరిస్థితుల్లో వైద్యుడిని కలిసి ఈ లక్షణం గురించి చెప్పి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది కచ్చితంగా గుండెపోటు సంకేతమే.
శ్వాస పూర్తిగా తీసుకోకపోవడం
రెండు అడుగులు వేసేసరికి శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా దీర్ఘంగా శ్వాస తీసుకోవల్సి రావడం గుండెపోటు సంకేతం కావచ్చు. ఈ సమస్య ఉదయం వేళ ఉంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ఇది హార్ట్ ఎటాక్ కు అతి పెద్ద లక్షణం అవుతుంది. తక్షణం పుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి.
ఎడమ భాగంలో నొప్పి
ఉదయం లేచిన వెంటనే మీ శరీరం ఎడమ భాగంలో నొప్పిగా ఉంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇది హార్ట్ ఎటాక్ సంకేతం కావచ్చు. ఈ నొప్పి అనేది సాధారణంగా ఎడమ చేయి, ఎడమ భుజం, జబ్బలు ఇలా శరీరంలోని ఏ ఎడమ భాగంలోనైనా రావచ్చు. ఇది కచ్చితంగా హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు. అప్రమత్తం కావల్సి ఉంటుంది.
శ్వాసలో నొప్పి
ఉదయం వేళ దీర్ఘంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే అంటే శ్వాస తీసుకునేటప్పుడు నొప్పిగా ఉంటే కచ్చితంగా ఇది గుండెపోటు కావచ్చు. ఈ సమస్య ఉదయం సమయంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. ఇది హార్ట్ ఎటాక్‌కు కీలకమైన సంకేతం కావచ్చు. తక్షణం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి.
Also read: Diabetes Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులకు అత్యంత ప్రమాదకరమైన 4 పండ్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook