'ప్రేమలో.. పాపలు బాబులు' మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మురళీ మోహన్

కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అదే కోవలో వస్తున్న సినిమా ‘ప్రేమలో..’. ‘పాపలు బాబులు’. అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ హైదరాబాద్ లో జరగగా.. మురళీమోహన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 08:11 PM IST
'ప్రేమలో.. పాపలు బాబులు' మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మురళీ మోహన్

శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న సినిమా ‘ప్రేమలో..’. ఈ సినిమా ట్యాగ్ లైన్. ‘పాపలు బాబులు’. విజయ మాధవి బల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అభిదేవ్ హీరోగా నటిస్తున్నారు.  హైదరాబాద్ లో సోమవారం రోజున ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచింగ్ జరగగా.. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి.. మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు సమీర్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాత లయన్ సాయి వెంకట్, డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, నిర్మాత విజయ మాధవి, సినిమాటోగ్రాఫర్ వంశీ, హీరో అభిదేవ్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా,  ఎస్.జి..ఆర్, ఫ్రాంక్లింగ్ సుకుమార్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా..

ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. బ్యానర్ పేరు 'విజయ మాధవి' అద్భుతంగా ఉంది. కష్టపడి, ఇష్టపడి చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే శ్రీ రాజ్ కష్టపడే మనస్తత్వం కాబట్టి మంచి దర్శక నిర్మాతగా నిలబడతారు. ఈ సినిమా టైటిల్  ప్రేమలో పాపలు, బాబులు అనేదే కొత్తగా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ విన్నా.. అదికూడా ఇంట్రెస్టింగ్‌గా, కొత్తగా అనిపించింది. శ్రీరాజ్ సీరియల్స్ చేస్తూనే.. సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

శ్రీరాజ్ మాట్లాడుతూ.. 'ఇది వరకు మురళీ మోహన్ గారిని నేను 2 సార్లు కలిశాను. మురళీ మోహన్ గొప్ప నటుడు, మంచి మనిషి. పిలవగానే వచ్చారు. ఆయన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీయటం నా గురువు రామసత్యనారాయణ దగ్గర నేర్చుకున్నాను. నటుడు సమీర్ నాకు మంచి ఆప్తుడు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆశీర్వదించాలని' కోరారు. 

'శ్రీ రాజ్ కష్టపడి సినిమాలు చేస్తుంటాడు, ఇది అతనికి ఐదో సినిమా.. ఈ సినిమాతో తన భార్యను నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు. నా మనుషులే ఈ సినిమాకి పని చేశారు. మోషన్ పోస్టర్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ థాంక్స్' అని రామసత్య నారాయణ తెలిపారు. 

Also Read: Infinix Note 30 5G మొబైల్‌ను రూ. 1,190కే పొందండి..ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఇవే..

ఈ సినిమా హీరో అభిదేవ్ మాట్లాడుతూ.. హీరోగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను.. ఈ సినిమాతో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను.. అని తెలిపారు 

ఈ సినిమా నిర్మాత విజయ మాధవి బల్లా మాట్లాడుతూ.. మా ఆయన ఇప్పటివరకు 4 సినిమాలు చేశారు.. ఆయనకు ఒక పెద్ద హిట్ రావాలను కోరుకుంటున్నా.. మా ఆయన కోసమే నేను నిర్మాతగా మారాను.. ఆయన పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. భవిష్యత్తులో ప్రేక్షకుల ప్రోత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తాం అని పేర్కొన్నారు. 

నటీనటులు- అభిదేవ్
సాంకేతిక వర్గం:
బ్యానర్ - శ్రీవిజయమాధవి క్రియేషన్స్
నిర్మాత - విజయ మాధవి బల్లా 
దర్శకత్వం - శ్రీరాజ్ బల్లా
సంగీతం - రవి బల్లా, ఫ్రాంక్లింగ్ సుకుమార్
కెమెరా మెన్ - వంశీ, ఎస్.జి.ఆర్, 
లిరిక్స్ - వీరు
వి.ఎఫ్.ఎక్స్ - చందు ఆది
డైలాగ్స్ - హరి , ఉప్పాడ

Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News