MLA Etela Rajender: ఎందుకు అమలు చేయలేదు కేసీఆర్.. మనసు లేకనా..? డబ్బులు లేకనా..?: ఈటల రాజేందర్

Etela Rajender Press Meet: బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలపై ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు. డబ్బులు లేక ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ఇస్తోందన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ సాధ్యం కాదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2023, 07:11 PM IST
MLA Etela Rajender: ఎందుకు అమలు చేయలేదు కేసీఆర్.. మనసు లేకనా..? డబ్బులు లేకనా..?: ఈటల రాజేందర్

Etela Rajender Press Meet: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని.. ఎన్నో హామీలను ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇల్లు, 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని.. సంక్షేమంలో నం.1 అన్న కేసీఆర్..  ఎందుకు అమలు చేయలేదు మనసు లేకనా..? డబ్బులు లేకనా..? అంటూ ప్రశ్నించారు. మొదటి ఆర్థిక మంత్రిగా తాను అప్పుడే చెప్పానని.. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయడం ముఖ్యమని అంటే అవహేళన చేశారని చెప్పారు. మరి ఎందుకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అడిగారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

"పేద ప్రజల మీద ఉన్న గౌరవం ఇదేనా అని సీఎం కేసీఆర్‌ను అడుగుతున్నా.. ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న అన్నట్టు.. ఓట్లప్పుడు ఉండే ప్రకటన చేతల్లో ఎందుకు లేవు అని అడగండి. రుణమాఫీ ఇస్తా అని ఇన్ని రోజులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు.. ఎన్నికల్లో ఓటమి తప్పదని రింగ్ రోడ్డు కుదవ పెట్టి.. భూములు అమ్మి, మద్యం టెండర్ల ముందు పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు ఇస్తున్నారు.. మొత్తం రుణమాఫీ కాలేదు.. 2018 నాటికే అప్పు డబుల్ అయ్యింది.. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది.

57 ఏళ్ల పెన్షన్ కాదు భర్తలు చనిపోయిన వారికి కూడా నాలుగు ఏళ్లుగా దిక్కులేదు. డబ్బులు లేక కేసీఆర్ హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. నేను పేదల, అణగారిన వారి పక్షపాతిగా ఆకలి దుఖాన్ని అర్థం చేసుకున్న వాడిగా సంతోషం వ్యక్తం చేస్తున్నా.. కానీ పాత ఆర్థిక మంత్రిగా అమలు కానీ హామీలు ఇవ్వొద్దని చెబుతున్నా.. అప్పుడు మంత్రిగా ఉండి లక్ష రుణమాఫీ సాధ్యం కాదని చెప్పా. రెండు లక్షల కోట్లు ఎలా చేయగలరు..? మన రాష్ట్ర ఆర్థిక ప్రగతి 5 శాతం కంటే ఎక్కువ ఉండదు.." అని ఈటల రాజేందర్ అన్నారు.

కర్ణాటక మోడల్ అంటున్నారని.. అక్కడ ఇచ్చిన హామీలు ఎలా త్రునీకరిస్తున్నారో చూస్తున్నామన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో నిలదీయాలని ప్రజలను కోరారు. నమ్మి మోసపోవద్దని సూచించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఎంత..? ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ ద్వారా వచ్చేది ఎంత..? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చేది ఎంత అనే సంపూర్ణ అవగాహన ఉన్నవాడినని.. అణగారిన వర్గాలకు ఏ స్కీమ్‌లు చేయాలో డిజైన్ చేస్తామన్నారు. కేంద్ర సమన్వయంతో ఎక్కువ నిధులు తెస్తామన్నారు. కేంద్ర పార్టీ తెలంగాణ మీద దృష్టి పెట్టిందని ఈటల తెలిపారు.

Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!

Also Read: Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News