Naga Chaitanya buys Racing Team: అక్కినేని హీరో నాగచైతన్య కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓ మోటర్ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఇతడు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (హెచ్‌బీబీ) రేసింగ్ టీమ్‌కు ఓనర్‌గా మారాడు. మోటర్ రేసింగ్ గేమ్‌లో భాగమవ్వాలనే తన కల ఈ రూపంలో తీరడం ఆనందంగా ఉందని చైతూ పేర్కొన్నాడు. రేసింగ్ పోటీల పట్ల ఆసక్తి కలిగిన యువ ప్రతిభావంతులకు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ చక్కటి వేదిక అవుతుందని చైతూ తెలిపాడు.
ఈ ఏడాది జరుగనున్న ఫార్ములా 4 ఇండియన్ చాంఫియన్‌షిప్ లో నాగచైతన్య టీమ్ పోటీపడబోతుంది. నాగచైతన్య టీమ్‌కు అఖిల్ రబీంద్ర, నీల్ జానీ డ్రైవర్స్‌గా వ్యవహారించనున్నారు. ముందు నుంచి అక్కినేని హీరోలకు రేసింగ్ గేమ్స్ పట్ల ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగిన రేసింగ్ గేమ్స్‌లో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ సందడి చేశారు.
ప్రస్తుతం చైతూ కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 20 నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుల జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా ద్వారానైనా హిట్ కొట్టాలని చైతూ భావిస్తున్నాడు. త్వరలో శివనిర్వాణతో కూడా మూవీ చేయబోతున్నాడు నాగచైతన్య.
Also Read: Bhola Shankar in OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook