వివాదంగా మారిన ఆర్మీ ఉద్యోగాల ప్రకటన

ఖాళీ ఉద్యోగాల కొరకు విడుదలైన ప్రకటన వివాదాస్పదమైంది.

Last Updated : Sep 2, 2018, 01:15 PM IST
వివాదంగా మారిన ఆర్మీ ఉద్యోగాల ప్రకటన

ఖాళీ ఉద్యోగాల కొరకు విడుదలైన ప్రకటన వివాదాస్పదమైంది. అయితే వివాదం చెలరేగింది భారత్‌లో కాదు.. పక్కనున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్‌లో పాక్ ఆర్మీ, పాకిస్థాన్ రేంజర్స్ (సింధ్) ఉద్యోగాల కొరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో స్వీపర్, శానిటరీ సిబ్బంది నియామకానికి ముస్లిమేతరులు అర్హులుగా ప్రకటించడంతో ఈ ప్రకటన వివాదాస్పదమైంది. ఆగస్టు 26న ప్రచురితమైన ఈ ఉద్యోగాల ప్రకటనను సామాజిక వేత్త కపిల్ దేవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరుల పరిస్థితికి ఈ ప్రకటన అద్దంపడుతోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా ఇటీవలే అక్కడ ఏర్పడిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఊహిస్తున్న 'నయా పాకిస్థాన్' అంటే ఇదేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

<

 

అటు పాక్‌కు మరోసారి అమెరికా షాకిచ్చింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం పాక్‌ మిలటరీకి ఇచ్చే 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2130.15 కోట్లు) సాయాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొద్దినెలల క్రితమే పాక్‌కు ఇచ్చే 500 మిలియన్ డాలర్ల సాయాన్ని యూఎస్‌ కాంగ్రెస్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Trending News