Jailer Movie: సూపర్‌ స్టార్‌ క్రేజ్ మామూలుగా లేదు... 'జైలర్‌' రిలీజ్‌ రోజు ఆ సంస్థ ఉద్యోగులకు సెలవు..!

Jailer Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ కంపెనీ మూవీ విడుదల రోజు ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 12:27 PM IST
Jailer Movie: సూపర్‌ స్టార్‌ క్రేజ్ మామూలుగా లేదు... 'జైలర్‌' రిలీజ్‌ రోజు ఆ సంస్థ ఉద్యోగులకు సెలవు..!

Jailer Movie Release: తమిళనాట రజినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అక్కడ ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. తలైవా నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'జైలర్'(Jailer Movie). ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది. తాజాగా ఈ మూవీ విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా మూవీ టికెట్స్ ను ఇవ్వనుంది.  చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

'జైలర్' సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీ కోసం తెలుగు అడియెన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చూస్తున్నారు. సూపర్ స్టార్ వచ్చిన తర్వాత రోజే మెగాస్టార్ కూడా రానున్నాడు. భోళాశంకర్ తో చిరంజీవి ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడి చాలా ఏళ్లే అయింది. మరి ఈ రేసులో ఎవరో విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Also Read: Salaar Movie First single: ప్రభాస్‌ 'సలార్' ఫస్ట్‌ సింగిల్ వచ్చేది అప్పుడేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News