Infinix Note 30 5G Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ మార్కెట్లో రెండు వారాల క్రితం విడుదలైంది. దీనిని Infinix Note 30 5G మొబైల్ ఫోన్ పేరిట విడుదల చేసిన సంగతి అందిరికీ తెలిసిందే..అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తోంది. కంపెనీ మొదటగా మార్కెట్లోకి ఈ మొబైల్‌ను రూ. 19,999 ధరతో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దాదాపు 20 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ రూ. 15,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Infinix Note 30 మొబైల్‌ను కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లిస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీకు రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 4000 వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ డిస్కౌంట్ పొందడానికి మీరు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ పోను రూ. 14,000లకే లభిస్తోంది. Infinix Note 30 5G మొబైల్ ఫోన్ 108 MP బ్యాక్ కెమెరాతో అందుబాటులో ఉంది. ఒక సెల్పీ కోసం, వీడియో కాలీంగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నాల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. త్వరలోనే కంపెనీ వీటి సేలింగ్ సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతోందని సమాచారం.
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
ఫీచర్స్:
✾ 6.78 అంగుళాలు డిస్ప్లే
✾ 1080 x 2460 పిక్సెల్స్ స్పష్టత
✾ Mediatek డైమెన్సిటీ 6080 చిప్సెట్
✾ ఆండ్రాయిడ్ 13 OS
✾ ఆక్టా-కోర్ CPU
✾ 108MPతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్
✾ 16MP సెల్ఫీ కెమెరా
✾ Li-Po 5000 mAh బ్యాటరీ ఫ్యాకప్
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి