Side Effects of Eating Cold Rice: భారతీయులు ఆహారంగా ఎక్కువగా అన్నాన్ని తింటూ ఉంటారు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో ప్రతి ఒక్కరూ ఆహారంగా అన్నాన్ని తింటారు. అయితే బీజీ లైఫ్ కారణంగా వేడి, చల్లగా తేడా లేకుండా ఎలా అనుకూలంగా ఉంటే అలా తింటున్నారు. చల్లని అన్నాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చల్లని అన్నాన్ని ప్రతి రోజు తినడం మంచిదేనా? తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చల్లాని అన్నం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ క్రియ సమస్యలు:
చల్లని అన్నాన్ని ప్రతి రోజు తినడం వల్ల చాలా రకాల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల చాలా మందిలో జీర్ణక్రియ దెబ్బ తిని.. ఆహారాలు జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కొందరిలోనైతే జీర్ణ శక్తి కూడా తగ్గిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజు చల్లని అన్నం తినడం మానుకోండి.
Also Read: Mahesh Babu New Car: కొత్త కారు కొన్న మహేశ్ బాబు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..!
శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయే ఛాన్స్ ఉంది:
చల్లటి అన్నాన్ని ప్రతి రోజు తినేవారిలో బాసిల్లస్ సెరియస్ వంటి హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని కారణంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బ్యాక్టీరియా అతిగా పెరగడం కారణంగా తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.
గ్యాస్ , ఉబ్బరం సమస్యలు రావొచ్చు:
చల్లటి అన్నం తినేవారిలో తరచుగా గ్యాస్, ఉబ్బరం వంటి తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొందరిలో తీవ్ర జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తున్నాయి. గ్యాస్ , ఉబ్బరం సమస్యల కారణంగా చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలైన మలబద్ధకం సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో ప్రేగుల్లో వాపు సమస్యలు కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది:
ప్రస్తుతం చాలా మంది చల్లని అన్నాన్ని తింటున్నారు. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా మందిలో దీని వల్ల జీర్ణక్రియ మందగించి తీవ్ర పొట్ట ససమ్యలకు దారి తీస్తోంది. కాబట్టి ప్రతి రోజు చల్లని అన్నం తినేవారు తప్పకుండా ఇవి గుర్తుంచుకోండి.
Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook