Surya Grahan Effect 2023: సూర్యగ్రహణం ఖగోళ దృగ్విషయం. ఈ సంవత్సరం మెుత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న వైశాఖ అమావాస్య రోజున సంభవించింది. ఇది మనదేశంలో కనిపించలేదు. రెండవ లేదా చివరి సూర్యగ్రహణం అశ్వినీ అమావాస్య నాడు అంటే అక్టోబరు 14న ఏర్పడబోతుంది. ఇప్పడు ఏర్పడబోయేది కంకాణాకృతి సూర్యగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య మరియు చంద్ర గ్రహణాలు రెండూ అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ చివరి సూర్యగ్రహణం మెుత్తం 12 రాశులవారి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషరాశి
అక్టోబర్ 14న ఏర్పడబోయే సూర్యగ్రహణం మేషరాశి వారికి అనేక సమస్యలను సృష్టిస్తుంది. మీరు మోసపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మెుద్దు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఉద్యోగంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవల్సి ఉంటుంది.
కన్య రాశి
ఈ గ్రహణం కన్య రాశి వారికి కూడా అశుభ ఫలితాలను ఇస్తుంది. మీ స్నేహితులే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీరు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు మానసికంగా కుంగిపోతారు. మెుత్తానికి ఈ సమయం అస్సలు కలిసిరాదు.
తులారాశి
గ్రహణం ఈ రాశి వారికి అశుభం. మీ పై ఒత్తిడి పెరుగుతుంది. మీ మానసిక స్థితి బాగుండదు. ఆర్థికంగా నష్టపోతారు. మీ జేబుకి చిల్లుపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
వృషభం
సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మాటలను అదుపులో ఉంచుకోండి. ఈ సమయంలో విలువైన లేదా ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పని ప్రదేశంలో బాధ్యత పెరుగుతుంది.
సింహరాశి
ఈ సూర్యగ్రహణం ఈ రాశి వారికి కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పరువు పోయే అవకాశం ఉంది.
Also read: July Gochar 2023: జూలై నెలలో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook