Kallu vs Neera: కల్లుకు, నీరాకు తేడా ఏంటి? నీరా చెట్టు నుంచి ఎలా తీస్తారు?

Kallu Benefits vs Neera Benefits:  నీరా, కల్లు మధ్య చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు నీరా, కల్లు తీసుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి?

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 11:08 AM IST
Kallu vs Neera: కల్లుకు, నీరాకు తేడా ఏంటి? నీరా చెట్టు నుంచి ఎలా తీస్తారు?

What is Difference Between Kallu and Neera: ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక ప్రఖ్యాత టూరిస్ట్ ప్రదేశంలో నీరా కేఫ్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇలా చేయడం ఏంటి? అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కానీ చాలా మంది నీరా, కల్లు ఒకటే అనుకుంటున్నారు. కానీ నీరా వేరు కల్లు వేరు అని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే నీరా, కల్లు మధ్య చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కల్లులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. కానీ నీరాలో మాత్రం ఆల్కహాల్ కంటెంట్ ఉండదు. సహజ సిద్ధంగా చెట్ల నుంచి లభించే నీరాతో చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నీరా తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి సేకరిస్తారు. అయితే ఇలా సేకరించిన నీరాని సూర్యోదయం కంటే ముందే తాగాలి. ఎందుకంటే ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు గనుక పెరిగితే నీరా పులిసిపోతుందని చెబుతున్నారు. అది పులసి పోయి కల్లుగా మారుతుందట. అందుకే ఉదయాన్నే నీరాని చెట్టు నుంచి తీసుకొని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చెట్ల నుంచి కల్లు కావాలంటే నీరాలో ఈస్ట్ అనే పదార్థం కలుపుతారు.

అందువల్ల అది పుల్లగా ఉంటుంది, ఆల్కహాల్ కంటెంట్ ఉండటం వల్ల కల్లు తాగడం వల్ల నిషా వస్తుంది. కానీ నీరా మాత్రం కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే నీరా అందరూ తాగినా కల్లు మాత్రం అందరూ తాగరు. చాలామంది నీరా తాగడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కల్లు, నీరా పక్క పక్కన పెడితే చాలా మంది నీరా తాగేందుకు ఆకర్షితులవుతారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నీరాని సేకరించే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది, దానికోసం ముందే ఒక కొండకట్టి సేకరిస్తారు.

Also Read: Sreeleela Tension: కోట్లు పెట్టి తెచ్చుకుంటే నిర్మాతలకు తలనొప్పిగా మారిన శ్రీలీల

నీరా వల్ల లాభాలు:
నీరా తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. నీరా కనుక తీసుకుంటే పిల్లలు మొదలు పెద్దవారి వరకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా ముసలివారు గనుక నీరా తీసుకుంటే వారికి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయట. ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ నీరా తీసుకుంటే అది అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.

అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా నియంత్రణలో ఉంచుతుందని ఒకవేళ ఈ నీరా రెగ్యులర్గా తాగితే చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలా తాగడం వల్ల ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని, అలాగే ఎముకలను కూడా నీరా మరింత బలంగా చేస్తుందని చెబుతున్నారు. ఇక ఈ నీరా గనుక తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి ఇబ్బందులను దూరం చేస్తుందని చెబుతున్నారు.

అలాగే ప్రస్తుతం చాలా మందిలో వస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది కిడ్నీ సమస్య, కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు వాటిని పూర్తిస్థాయిలో అరిగించలేక కష్టపడుతూ కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నీరా తాగితే కిడ్నీలకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు.

కిడ్నీలో ఉండే రాళ్ళను తొలగించడంలో నీరా ప్రధాన పాత్ర పోషిస్తుందని, నీరా తాగిన వారందరికీ కిడ్నీల ఇబ్బందులు చాలా తక్కువ అవుతాయని చెబుతున్నారు. కేవలం కిడ్నీ సమస్యలు ఇతర సమస్యలే కాదు ఈ నీరా తాగడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేర్ మీద అందరి దృష్టి పడుతోంది.

Also Read: Anasuya Targets Devarakonda: ఇదేం పైత్యం..దేవరకొండపై అనసూయ సంచలన ట్వీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News