MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 ప్రారంభించడానికంటే ముందు నుంచే అత్యంత వైరల్ అయిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ న్యూస్ గురించే. ఐపిఎల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారిలో ఎక్కువగా చర్చనియాంశమైన అంశం ఎం. ఎస్. ధోనీ రిటైర్మెంట్. మీడియాలో ఎక్కువగా పబ్లిష్ అయిన వార్తా కథనాల్లోనూ ఇదొకటి. అన్నింట్లోనూ కామన్ పాయింట్ ఒక్కటే. ఐపిఎల్ 2023 తరువాత మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడా అనేదే.
మహేంద్ర సింగ్ ధోనీ మనసులో ఏముందు తెలియకుండానే రకరకాల కోణాల్లో చర్చించడంతో పాటు ధోనీ 2023 ఐపిఎల్ తరువాత రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వైరల్ అయిన వార్తా కథనాలే ఎక్కువ. ఇదే ధోనీ కెరీర్లో చివరి ఐపిఎల్ సీజన్ అంటూ కొంతమంది.. ఐపిఎల్ 2023 తరువాత ధోనీని ఇక మనం క్రీజులో చూడలేకపోవచ్చునేమో అని ఇంకొంతమంది ఇలా ఎవరికి తోచిన కామెంట్స్, కథనాలు వారు రాసుకొచ్చారు.
ఇదిలావుండగా ప్రస్తుతం ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచిన సందర్భంగా ధోనీ మద్దుతుదారులు భారీ కరతాళ ధ్వనుల మధ్య ధోనీ.. ధోనీ.. ధోనీ అంటూ నినాదాలు చేశారు. ధోనీ అనుకూల నినాదాలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. వాస్తవానికి మ్యాచ్ జరుగుతోంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు హోమ్ గ్రౌండ్ అయిన లక్నో స్టేడియంలో అయినప్పటికీ.. ధోనీ సపోర్టర్స్ అంతా యెల్లో టీషర్ట్స్ ధరించి స్టేడియంను పసుపుమయం చేశారు. ధోనీకి వచ్చిన సపోర్టుని చూసిన బ్రాడ్‌కాస్టర్ డానీ మోరిసన్ స్పందిస్తూ.. కెరీర్ చివర్లో వస్తున్న ఈ ప్రోత్సాహం చూస్తోంటే మీకు ఏం అనిపిస్తోంది అని అడిగాడు.
MSD keeps everyone guessing 😉
The Lucknow crowd roars to @msdhoni's answer 🙌🏻#TATAIPL | #LSGvCSK | @msdhoni pic.twitter.com/rkdVq1H6QK
— IndianPremierLeague (@IPL) May 3, 2023
డానీ మారిసన్ వేసిన ఈ ప్రశ్నకు ధోనీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇదే నా చివరి టోర్నమెంట్ అని మీరు, మీడియా వాళ్లు డిసైడ్ చేశారు కానీ నేను కాదు కదా అని చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారింది. ధోనీ ఇచ్చిన ఈ సమాధానం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ మాటలు చూస్తే.. అతడు ఇప్పట్లో ఐపిఎల్ నుంచి తప్పుకునే మూడ్ లో లేనట్టున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ధోనీ తల్చుకుంటే ఇంకా కెరీర్ ని కంటిన్యూ చేసేంత సత్తా అతడి వద్ద ఉంది అని గతంలో కొంతమంది సీనియర్ క్రికెటర్స్, క్రికెట్ ఎనలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ధోనీ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఏదేమైనా.. ధోనీ మనసులో ఏముందో ధోనీ చెబితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.