Vaaradhi Review: సస్పెన్స్ థ్రిల్లర్ 'వారధి'.. ఎలా ఉందంటే..?

Vaaradhi Movie Review and Rating: భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాన్ని ఆవిష్క‌రించిన చిత్రం 'వారధి'. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై, పెయ్యాల భారతి, ఎం.డి.యూనస్ నిర్మాతలుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారధి’ మూవీ తాజాగా మూవీ (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అయింది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను ఎట్రాక్ట్ చేసిందా? అంచ‌నాలు నిల‌బెట్టుకుందా? మూవీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 27, 2024, 05:44 PM IST
Vaaradhi Review: సస్పెన్స్ థ్రిల్లర్ 'వారధి'.. ఎలా ఉందంటే..?

Vaaradhi Movie Review and Rating:  టైటిల్: వారధి
బ్యానర్: రాధా కృష్ణ ఆర్ట్స్
సమర్పణ: విబ్గ్యోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
వ్యవధి: 2గం. 5ని.
సెన్సార్ రేటింగ్: UA
విడుదల తేదీ: 27 డిసెంబర్, 2024

కథ‌:
ఈ మూవీ ఓ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్. కొత్త‌గా పెళ్ల‌యిన చంద్రు (అనిల్ ఆర్కా) - న‌క్ష‌త్ర (విహ‌రిక చౌద‌రి) ఇద్ద‌రి మ‌ధ్య కొద్ది రోజుల్లోనే మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థాలు చోటు చేసుకుంటాయి. న‌క్ష‌త్రకు అనుకోకుండా విన‌య్ (ప్ర‌శాంత్)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. భ‌ర్త యాసిడ్ దాడికి గుర‌వుతాడు. న‌క్ష‌త్ర జీవితంలోకి న‌కిలీ వ్య‌క్తి ప్ర‌వేశిస్తాడు. ఇంత‌కీ ఆమె ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఎలా చిక్కుకుంటుంది? భ‌ర్త‌కు తిరిగి ద‌గ్గ‌ర‌వుతుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.      

నటీనటుల ప్రతిభ:
అనిల్ అర్కా - చంద్రగా: చంద్ర పాత్రలో అనిల్ అర్కా భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు.
విహారిక చౌదరి - నక్షత్రగా: నక్షత్ర పాత్రలో విహారిక ఆకట్టుకునే నటన చేశారు, కథకు కీలకమైన భావోద్వేగాలు పంచారు.
ప్రశాంత్ మడుగుల - వినయ్‌గా: ప్రతినాయకుడిగా ప్రశాంత్ పాత్రలో కఠినత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రిది - ముఖ్య పాత్రలో: రిధి పాత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చింది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు, కథా రచయిత: శ్రీకృష్ణ. దర్శకుడి కథన శైలి, భావోద్వేగాలతో నిండిన స్క్రిప్ట్ సినిమా ప్రధాన బలం.
నిర్మాతలు: పెయ్యాల భారతి, మణికలా రాధ, ఎం.డి. యూనస్. నిర్మాణ విలువల పరంగా బాగా నిర్వహించారు.
సినిమాటోగ్రఫీ: శక్తి జె.కె. విజువల్స్. సినిమా ఫీల్‌ను కొత్తగా తీర్చిదిద్దాయి.
సంగీతం: షారుఖ్ షేక్. గీతాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మంత్ర‌ముగ్దులను చేస్తాయి.
రచయిత: నాగేంద్ర పలగాని. డైలాగ్స్ ప్రాముఖ్యతను అందించారు.

విశ్లేషణ:
డైరెక్ట‌ర్ శ్రీకృష్ణ త‌ను రాసుకున్న క‌థ‌ను తెర‌పై చూపించ‌డంతో స‌క్సెస్ అయ్యాడు. ఈ త‌రం యువ జంట‌లు చేసే పొర‌పాట్ల‌ను చ‌క్క‌గా చూపించారు. హీరోహీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ సీన్లు యూత్ ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేస్తాయి. ఎమోష‌న్ సీన్లు కూడా చ‌క్క‌గా పండాయి. ఉత్కంఠ‌రేపేలా ట్విస్టుల‌ను డైరెక్ట‌ర్ చ‌క్క‌గా తెర‌కెక్కించారు. కొత్త నటీనటులతో చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందిస్తుంది.

తీర్పు: భావోద్వేగాలు, సస్పెన్స్ కలగలిసిన అందమైన థ్రిల్లర్. 

రేటింగ్: 2.75/5

Trending News