Tamarind Seeds Benefits: మనలో చాలామందిలో ముఖంపై నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు యువతను ఎక్కువగా చూస్తాం. తెల్లని చర్మంపై అక్కడక్కడ మచ్చలు రావడంతో ముఖం అంద హీనంగా తయారవుతోంది అంతేకాకుండా కొంతమందిలో నల్ల మచ్చల పరిమాణం పెరిగి ముఖం నల్లగా మారుతోంది. అయితే ఈ చర్మ సమస్యకు స్కిన్ లోపల దాగి ఉన్న మెలనిన్‌కు ప్రత్యేక సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలోని ఇది కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ మెలనిన్ పరిమాణాలు పెరిగినప్పుడు జుట్టు నల్లగా చర్మంపై రంగు రావడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
కొన్ని కొన్ని సందర్భాల్లో మన శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ బలహీనపడితే మెలనిన్ మెలనోసైట్స్ తో పాటు థైరోసోనైస్ అనే ఎంజైమ్ ఎక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. అయితే దీని ప్రభావం చర్మం పై పడి మచ్చలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ల పరిమాణాలు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల ఇతర అవయవాలపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.
శరీరంలోని ఈ ఎంజాయ్ అధిక మోతాదులో విడుదల కావడం వల్ల చర్మంపై ఏర్పడే మంగు మచ్చల నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఖరీదైన ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారు అంటున్నారు. మరికొంతమంది అయితే మార్కెట్లో లభించే రూ.వేలు కలిగిన ఖరీదైన సౌందర్య సాధనాలను అతిగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఇతర చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ మంగు మచ్చల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన హోమ్ రెమెడీస్‌ని పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
చర్మంపై మంగు మచ్చలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన చింత గింజలను ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఈ చింత గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పై ఉన్న మంగు మచ్చల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దిగినైన వినియోగించడం వల్ల చర్మం కూడా సహజంగా నిగనిగలాడుతుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter