Tamarind Benefits For Hair: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి ఇంటి చిట్కాలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే వెంట్రుకల సంరక్షణలో చింతపండు కీలక పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈ రసంలో ఉండే గుణాలు జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, డ్యామేజ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా చింతపండులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన సమస్యలను సులభంగా అధిగమిస్తాయి. ఈ రసం జుట్టుకు ఉపయోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చుండ్రుకు గుడ్ బై చెప్పండి:
చింతపండులో ఉండే విటమిన్ సి స్కాల్ప్‌ను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం..చింతపండును నీళ్లలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే చింతపండును బాగా మెత్తగా చేసి ఈ నీటిని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.
జుట్టు మృదువుగా మారుతుంది:
జుట్టును మృదువుగా ఉంచుకోవడానికి చింతపండు రసాన్ని వాడొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో చింతపండు రసాన్ని తీసుకోవాలి. అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఈ మిశ్రమం ఆరిపోయిన తర్వాత.. జుట్టును షాంపూతో కడగాలి.
జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:
జుట్టు పెరుగుదలకు చింతపండు రసం ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈరసాన్ని జుట్టుకు క్రమం తప్పకుండా మర్దన చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.
జుట్టు రాలడం ఆగిపోతుంది:
జుట్టు రాలడం అనే సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. చింతపండు రసాన్ని వినియోగించి సమస్యను చిటికెలో పరిష్కరించవచ్చు. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టు రూట్ నుంచి దృఢంగా మార్చి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
Also Read: High Cholesterol Symptoms: ఈ రెండు అంశాలు శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను సూచిస్తాయి..!!
Also Read: High Cholesterol: ఈ 4 లక్షణాలు కొలెస్ట్రాల్ పెరిగుదలను సూచిస్తాయి..ఇవి పెరిగితే గుండెపోటు తప్పదు.!!
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!
Also Read: White Hair Problem: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా..ఈ అలవాట్లు మానుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.