Sapota Fruit Benefits In Telugu: చాలామంది పిల్లలు సపోటా పండ్లను తినేందుకు అంతగా ఇష్టపడరు. ఇవి తినడానికి ఎంతో తియ్యగా ఉన్నప్పటికీ కొంతమంది పెద్దలు కూడా వీటిని తినేందుకు పెద్దగా ఇష్టపడరు. నిజానికి ప్రతిరోజు సపోటా పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం, ఫైబర్, ఫాస్ఫరస్, కాల్షియం, మాగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఎంతో వారు ఆరోగ్యంగా ఉంటుంది దీంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో పోషక పరిమాణాన్ని కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజూ తింటే శరీరానికి తక్షణమైన శక్తి లభిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా ఉంటాయి.
సపోటా పండ్లను తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ క్రియ సమస్యలకు:
సపోటా పండ్లను ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా డైట్లో భాగంగా సపోటా పండ్లను చేర్చుకోండి.
చర్మ సమస్యలకు:
సపోటా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని చర్మ సమస్యలు ఉన్నవారు రోజు తినడం వల్ల ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం కూడా చాలా క్లీన్ గా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలకు:
గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా సపోటా పండ్లు ఎంతగానో సహాయ పడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా హృదయ స్పందనను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె ధమనుల పనితీరును కూడా చక్కదిద్దుతుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
క్యాన్సర్ను నిరోధిస్తుంది:
సపోటా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల క్యాన్సర్లను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని గుణాలు క్యాన్సర్ గణాలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఎముకల ఆరోగ్యానికి:
సపోటాలో కాల్షియంతో పాటు పాస్పరస్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు ఉన్న దృఢంగా చేసి.. అన్ని రకాల ఎముకలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా బోన్స్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారికి ఎంతగానో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.