Karnataka CM Siddaramaiah's Health Secret: నేటి కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలి, ఒత్తిడి కారణంగా చిన్నతనంలో డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. కొంతమందికి వంశపార్యపరంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. రోజువారీ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఉండే చక్కెర హెచ్చుతగ్గుల వల్ల డయాబెటిస్ వస్తుంది. అయితే దీనిని వ్యాధిగా భావించకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడాలని చెబుతున్నారు. అంతేకాదు సరైన డైట్ పాటించినట్లయితే షుగర్ పూర్తిగా నయం అవుతుందని చెబుతున్నారు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఆయన చెప్పిన హెల్త్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే షుగర్ నియంత్రణ సాధ్యం అవుతుందని సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలో గ్రుహ ఆరోగ్య స్కీంను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలను షేర్ చేసుకున్నారు. తాను ప్రతిరోజూ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతోపాటు 30ఏళ్లుగా షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకుంటున్నట్లు చెప్పారు.
అంతేకాదు 24ఏళ్ల క్రితం తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని స్టంట్ వేయించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల సలహాలు, సూచనలను పాటిస్తూ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స అందించినట్లయితే క్యాన్సర్ కూడా నయం అవుతుందని తెలిపారు. షుగర్, బీపీలను కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యం అవుతుందన్నారు. ఇవి అదుపులో ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనుసరించాలంటూ పలు సూచనలు చేశారు.
చాలా మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని..ఆర్థిక పరిమితుల కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకునేందుకు దూరంగా ఉంటున్నారని..అందువల్లే వ్యాధులను గుర్తించలేకపోతున్నారని తెలిపారు. దీంతో చాలా మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవితం అనారోగ్యానికి, ఇతర వ్యాధులకు అసలు కారణమన్నారు. అవే కాదు రసాయనాలు వాడే ఆహార పదార్థాల వాడకం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుందని సీఎం చెప్పారు. డయాబెటిస్, బీపీ వంటివాటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook