Jeera Benefits: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురయ్యే సమస్య శరీర బరువు. బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జీలకర్రతో బరువు తగ్గగలరని ఎంతమందికి తెలుసు...
సాధారణంగా బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలి లేదా గ్రీన్ టీ సేవనం, లేదా తప్పనిసరిగా వ్యాయామం. ఇప్పుడు ఇది సరికొత్త ప్రక్రియ. డైటింగ్, వ్యాయమం చేసినా సరే బరువు తగ్గకపోతే..ఈ చిట్కాలు పాటించాల్సిందే. కొన్ని రకాల మసాలా దినుసుల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రుచి పెరగడమే కాకుండా బరువు వేగంగా తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కచ్చితంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఎలా, ఏంటనేది పరిశీలిద్దాం.
ప్రధానంగా జీలకర్ర. ఇళ్లలో ప్రతిరోజూ వాడేదే. జీలకర్ర శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని జీలకర్ర మార్చగలుగుతుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు రోజూ జీలకర్ర నీటిని లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చడం ద్వారా బరువు తగ్గుతారు. ఇక మరో ప్రధాన సుగంధ ద్రవ్యం..దాల్చిన చెక్క. శరీరంలోని చక్కెరను ప్రాసెస్ చేసేది దాల్చిన చెక్కే. శరీరంలో ఉండే షుగర్..కొవ్వుగా మారకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుంది. దాల్చిన చెక్క కారణంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
ఇక మరో ముఖ్యమైంది నల్లమిరియాలు.శరీరంలో కొవ్వు కణాల ప్రక్రియను నిరోధిస్తాయి. ఎండుమిర్చి తినడం వల్ల కూడా కొవ్వు సంబంధిత సమస్యలు తలెత్తవు. తరచూ పెప్సీ టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ దూరమౌతాయి. నల్ల మిరియాల్ని వివిధ రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. మరో సుగంధ ద్రవ్యం యాలుక్కాయలు. జీర్ణక్రియకు ఇవి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. జీవక్రియను పెంచడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. యాలుక్కాయల్ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి మంచిదే.
ఇక బెస్ట్ యాంటీ బయోటిక్‌గా చెప్పుకునే పసుపు. పసుపు లేకుండా భారతీయ వంటలుండవు. పూర్తి ఆయుర్వేద గుణాలున్న పుసుపుతో శరీరంలో మంటలు వంటివి దూరమౌతాయి. పసుపు వివిధ రకాల విషపదార్ధాల్నించి మనల్ని కాపాడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Also read: Obesity Treatment: స్థూలకాయాన్ని సకాలంలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యమేనా, ఎలా గుర్తించాలి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook