International Yoga Day 2022 : రేపు ప్రపంచ యోగా దినోత్సవం.. ఈ మూడు అద్భుత ఆసనాల గురించి తెలుసుకోండి..

International Yoga Day 2022 : రేపు ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 07:02 PM IST
  • రేపు ప్రపంచ యోగా దినోత్సవం
  • యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం
  • యోగాలోని ఆసనాల్లో మూడు అద్భుత ఆసనాల గురించి ఇక్కడ తెలుసుకోండి
International Yoga Day 2022 : రేపు ప్రపంచ యోగా దినోత్సవం.. ఈ మూడు అద్భుత ఆసనాల గురించి తెలుసుకోండి..

International Yoga Day 2022 : రేపు ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటారు. యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతిగా చెప్పొచ్చు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది. వేద కాలం నుంచే భారత్‌లో యోగాను ఆచరించడం ఉంది. ప్రపంచ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాలోని ఆసనాల్లో ఊర్ధ్వ హస్తాసన, మాడిఫైడ్ ఊర్ధ్వ హస్తాసన, పాదహస్తాసన గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

ఊర్ధ్వ హస్తాసన:

ఊర్ధ్వ హస్తాసనాన్ని ఇంగ్లీషులో అప్‌వార్డ్ సెల్యూట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే.. రెండు చేతులను నిటారుగా పైకి లేపడం. ఈ ఆసనం శక్తిని మరింత ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉండేవారు ఈ ఆసనం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చొని ఉండం ద్వారా శక్తితో పాటు రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ ఆసనం ద్వారా రక్తప్రసరణతో పాటు శక్తి ఉత్తేజితమవుతుంది.

ఆసనం ఇలా 

కాళ్లపై నిటారుగా నిలబడి రెండు చేతులు భుజాలకు సమానంగా పైకి లేపాలి
ఇప్పుడు రెండు అరచేతులను వీలైనంత వరకు సాగదీయండి
ఆ సమయంలో మీ ముఖం పైకప్పు వైపు ఉండాలి
ఈ స్ట్రెచ్‌ను 10 సెకన్ల పాటు 3-5 సార్లు పునరావృతం చేయండి

మాడిఫైడ్ ఊర్ధ్వ హస్తాసనం :

ఈ ఆసనాన్ని 'అప్‌వర్డ్ సెల్యూట్ విత్ ఆర్చ్' అంటారు. ఇది శక్తివంతమైన భంగిమ. ఊర్ధ్వ హస్తాసన ఆసనానికి ఇది దగ్గరగా ఉంటుంది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

ఆసనం ఇలా
నిటారుగా నిలబడి రెండు చేతులు పైకి చాచాలి.
రెండు భుజాలకు సమానంగా నిటారుగా చేతులు చాచి.. ఆ రెండింటిని జోడించాలి
చూపుడు వేలు పైకి చూసేలా.. చేతిలో తుపాకీ పట్టుకున్నట్లుగా ఉండాలి.
మీ ముఖం పై కప్పు వైపే చూస్తుండాలి.
ఈ స్ట్రెచ్‌ను 10 సెకన్ల పాటు 3-5 సార్లు చేయండి

పాదహస్తాసనం :

పాదహస్తాసనాన్ని స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు. దీన్ని సులభంగా ప్రాక్టీస్ చేయవచ్చు. దీని ద్వారా రక్త ప్రసరణ పెరగడంతో పాటు కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి.తద్వారా శక్తి ఉత్తేజితమవుతుంది. 

ఆసనం ఇలా

నిటారుగా నిలబడండి
ఇప్పుడు, నెమ్మదిగా ముందుకు వంగండి
సగం వరకు వంగి మీ అరచేతులను నేలపై ఉంచాలి
పూర్తిగా వంగలేకపోతే మీ కాలి వేళ్లను తాకినా సరిపోతుంది.
ఈ సమయంలో, మీ ముఖం మీ కాళ్ళకు ఎదురుగా ఉండాలి
ఈ ఆసనాన్ని పలుమార్లు పునరావృతం చేయండి

Also Read: Chandra Babu on CM Jagan: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు పిరికితనానికి నిదర్శనం..సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..!

Also read:Basara IIIT: సీఎం నుంచి లేఖ వస్తేనే కదిలేది! బాసరలో ఏడవ రోజు అదే ఉద్రిక్తత.. కేసీఆర్ కు సంజయ్ లేఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News