Hibiscus for Bald Head: మందార పువ్వు నాచురల్ మ్యాజికల్ గుణాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మందార పూలు జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు కుదళ్ల నుంచి బలంగా మారుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది మందార పూలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదకు మేలు చేస్తుంది.
కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసి పిహెచ్ లెవెల్స్ సమతుల్యం,డాండ్రఫ్ కి దురద సమస్యలకు చెక్ పెడుతుంది
మందార పువ్వులో ఆ జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. ఎన్ఐహెచ్ నివేదిక ప్రకారం మందార పూలు జట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. షాంపూ, కండిషనర్ వివిధ రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మందార పూలను నూనెలో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.
తెల్ల వెంట్రుకలు..
మందార పువ్వులో నాచురల్ రంగు ఉంటుంది ఇందులో విటమిన్స్ ,యాంటి ఆక్సిడెంట్లు ఉత్పత్తికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మందార పూలు నాచురల్ కలర్‌గా కూడా వాడొచ్చు తెల్ల వెంట్రుకల సమస్య రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: మీకు సరిపోయే ఉప్పును ఎలా ఎంచుకోవాలి? ఎందులో ఏ ప్రత్యేకత ఉందో తెలుసా?
డాండ్రఫ్..
మందార జుట్టుకు మంచి ఆస్ట్రిజంట్ ఎఫెక్ట్ ఇస్తుంది. మందార పువ్వు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి జుట్టుకు అప్లై చేయడం వల్ల డ్యాండ్రఫ్ ఉన్నవారికి మేలు చేస్తుంది.
కండిషనర్..
మందారలో అమైనో యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది జుట్టును మృదువుగా మారుస్తాయి బలంగా మారుతుంది అంతేకాదు జుట్టు ఆరోగ్యకరంగా మందంగా తయారవుతుంది మందారను జుట్టుకు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు దీనికి ఇంటి చిట్కాలు బోలెడు ఉన్నాయి.
జుట్టు పెరుగుదల..
మందార పువ్వులతో నూనె, పొడి మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది హెయిర్ ఫాలికల్స్ ని బలంగా మార్చి పునరుజ్జీవనం అందిస్తుంది.
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
బట్టతలకు చెక్..
మందార పూలను ఉపయోగించడంలో హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది దీంతో జుట్టు మందంగా మారుతుంది బట్ట తల వచ్చే సమస్యకు ఎఫెక్ట్ గా పని చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి