Sapota Benefits: ఎండాకాలం వచ్చేస్తోంది. సపోటా సీజన్ మెుదలైంది. సపోటాను చికూ అని కూడా పిలుస్తారు. ఇది తియ్యదనంతోపాటు అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. దీనిని జ్యూస్ గా కూడా ఎక్కువ మంది తీసుకుంటారు. సపోటా పండ్లను తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
సపోటా ఉపయోగాలు
** తరుచూ సపోటా పండు తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
** సపోటాలో ఉండే విటమిన్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
** గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సపోటా కీలకపాత్ర పోషిస్తుంది.
** సపోటా తినడం వల్ల స్థూలకాయం లేదా ఊబకాయం వంటివి దూరమవుతాయి.
** శరీరంలో కొవ్వును కరిగించి.. బరువు తగ్గంచడంలో సపోటా అద్భుతంగా పనిచేస్తుంది.
** జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు సపోటా చెక్ పడుతుంది.
** గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా చాలా బాగా ఉపయోగపడుతుంది.
** మలబద్ధకాన్ని నివారించడంలో ఇది సూపర్ గా పనిచేస్తుంది.
** సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
** సపోటాలో ఉండే ఖనిజాలు ఎముకలను దృఢపరుస్తుంది.
** ఇది బీపీని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది.
Also Read: Pumpkin Seeds: గుమ్మడి గింజలు తినడం వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి