Fit and Slim Tips: ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం అనేది ఫిట్ అండ్ స్లిమ్‌తోనే సాధ్యం. అధిక బరువు ఎప్పటికీ అనర్ధమే. ఎంత నాజూగ్గా ఉంటే అంత బాగుంటుంది. అనారోగ్య సమస్యలు అంత దూరంగా ఉంటాయి. మరి ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాలి.
ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే మన జీవనశైలి మారాలి. సులభంగా చెప్పాలంటే పూర్వకాలం పెద్దల ఆహారపు సమయాలు, అలవాట్లు పాటించాల్సి ఉటుంది. ఇటీవలి కాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆహారపు సమయం మారిపోయింది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ పుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి. అందుకే శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం సమస్యగా మారుతోంది. దీనికి తోడు సమయాభావం వంటి కారణాలతో శారీరక శ్రమ లేకుండా పోతోంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఇప్పటికీ సమయం మించిపోలేదు..కొన్ని చిట్కాలు పాటిస్తే స్లిమ్‌గా మారవచ్చంటున్నారు.
ప్రతిరోజూ రాత్రి భోజనం 7 గంటల్లోపు పూర్తి చేయాలి. అది కూడా బలమైన ఆహారం కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేది తీసుకోవాలి. అయితే రాత్రి పూట ఎలాంటి భోజనం తినాలనే సందేహం రావచ్చు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల బరువు పెరగకుండా ఉండటమే కాకుండా ఉదయం తాజాగా ఉంటుంది. బద్దకం వంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు.
రాత్రి పూట ఆహారంలో కూరగాయల సలాడ్ అత్యుత్తమమైందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే సూప్ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే పచ్చివి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. జీర్ణ సమస్య రావచ్చు. ఇక రాత్రి వేళ ఆహారంలో ఓట్స్ ఖిచ్జీ మరో ప్రత్యామ్నాయం. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ కావడం వల్ల బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఇక మరో ప్రత్యామ్నాయ పోహా. ఇందులో కూడా కేలరీలు తక్కువ..ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో బరువు పెరగరు. ఇక మరో ఆప్షన్ మల్టీ గ్రెయిన్ రోటీ విత్ వెజిటెబుల్స్ కర్రీ. దీనివల్ల శరీరానికి కావల్సిన మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
రోజూ రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసి మరో రెండు గంటల్లో నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం తిరిగి 7 గంటల వరకూ ఏం తినకూడదు. అంటే 12 గంటల ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ అనుసరించాలి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలానే చేసేవారు. ఇప్పటికీ చాలా పల్లెల్లో ఇది అలవాటులో ఉన్న విధానమే. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మీ సొంతం.
Also read: Hair Care Tips: చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే మీ కేశాలు ఆరోగ్యంగా అందంగా నిగనిగలాడటం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook