Best food for Summer Heat: వేసవిలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా తర్వగా అలపట కలుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల వేసవిలో కలిగే డీహైడ్రేషన్, అలసట, నీరసం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆహారపదార్థాలను మీ డైట్‌లో భాగంగా తీసుకోవడం మరి ఉత్తమం.
వేసవిలో అలసటను పోగొట్టే ఆహారపదార్థాలు:
వేసవికాలంలో పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పండ్లలో నీరు, విటమిన్, మినరల్స్, ఉంటాయి. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయ, ద్రాక్ష, ఆరెంజ్, ఖర్జూరం, అరటిపండు, నిమ్మకాయ రసం వంటి పదార్థాలు ఎంతో ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటినతో పాటు మీరు వేసవికాలంలో లభించే ప్రతి కూరగాయలను తీసుకోవడం ఎంతో ఉత్తమం. కూరగాయలలో కూడా ఫైబర్, విటమిన్, మినరల్స్ ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సమ్మర్‌లో మీరు బీట్‌రూట్, క్యారెట్, బెండకాయ, పాలకూర, దోసకాయ వంటి కూరగాయలు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో తేలికమైన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో మజ్జిగను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలు కలగకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. వేసవిలో అధిక శాతం నీరును తీసుకోవాల్సి ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం మనలో కావాల్సి న నీరు లేకపోవడం. కాబట్టి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు కూడా తొలిగిపోతాయి. అలాగే కూల్ డ్రింక్స్ బదులుగా మీరు కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం. కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఆకలి, జీర్ణవ్యస్థ మెరుగా పని చేస్తాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య కలగకుండా ఉంటుంది.
బార్లీ నీరులో బోలెడు పోషకాలు దాగి ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని బయటకు పంపించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల అలసట కూడా దూరం అవ్వుతుంది. వేసవిలో ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలు శరీరానికి చాలా మంచివి.పుదీనా ఆకులు శరీరాన్ని చల్లబరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. వేసవిలో ఈ ఆహారపదార్థాలను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది, అలసట పోతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొన్ని చిట్కాలు:
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది.
తేలికపాటి, పసుపు రంగు బట్టలు ధరించడం మంచిది.
ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఈ చిట్కాలను పాటించడం వల్ల వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి