Summer Makeup Tips: ఎండలో మేకప్ జిడ్డుగా మారిపోతుందా? ఈ 6 టిప్స్ మీకోసం..

Summer Makeup Tips: ఎండకాలం మేకప్ వేసుకుంటే వెంటనే జిడ్డుగా మారిపోతుంది. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో మేకప్‌ వేసుకుని మరీ పెళ్లిళ్లు, పార్టీలకు వెళ్లలేని పరిస్థితి. మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ముఖం జిడ్డుగా మారిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 29, 2024, 09:39 AM IST
Summer Makeup Tips: ఎండలో మేకప్ జిడ్డుగా మారిపోతుందా? ఈ 6 టిప్స్ మీకోసం..

Summer Makeup Tips: ఎండకాలం మేకప్ వేసుకుంటే వెంటనే జిడ్డుగా మారిపోతుంది. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో మేకప్‌ వేసుకుని మరీ పెళ్లిళ్లు, పార్టీలకు వెళ్లలేని పరిస్థితి. మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ముఖం జిడ్డుగా మారిపోతుంది. ముఖం తాజాగా కనిపించదు. ఎందుకంటే మేకప్ వేసుకన్నప్పుడు ఫౌండేషన్ వాడతాం. ఎండకు అది జిడ్డుగా మారిపోతుంది. అంతేకాదు ఈ ప్రభావం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. దీనికి కొన్ని రెమిడీలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ముఖ్యంగా ఎండకాలం మేకప్ తక్కువగా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.అంతేకాదు మంచి నాణ్యత కలిగిన మేకప్ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలి. లేకపోతే స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దీంతో మీరు అదనంగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ముఖంపై మచ్చలు, మొటిమలతో బాధపడుతారు.

అయితే, ముఖ్యంగా వేసవికాలంలో వాటర్ ప్రూఫ్ మేకప్ వాడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మేకప్ త్వరగా పాడవ్వదు. ముఖం జిడ్డుగా మారకుండా ఉంటుంది. ఎండకాలం ఏ పార్టీలు, పెళ్లిల్లకు వెళ్లాలనుకుంటే తప్పకుండా వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోండి. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు తాజాదనంతో కనిపిస్తారు. దీంతో ముఖం జిడ్డుగా మారకుండా కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి:  ఈ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు పొరపాటున కూడా చికెన్, మటన్ తినకూడదు..

అంతేకాదు ఎప్పుడైనా మేకప్ వేసుకుంటే ముందుగా తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. లేకపోతే ముఖంపై ఉన్న మేకప్ త్వరగా పాడవుతుంది. మాయిశ్చరైజర్ ముఖాన్ని కాపాడుతుంది. వీలైతే బయటకు వెళ్లినప్పుడు మేకప్ వేసుకోవాల్సి వస్తే ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోండి. ఆ తర్వాత లేయర్ సన్‌స్ర్కన్ రుద్దుకోండి. ఇది హానికరం అతినీలలోహిత కిరణాల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. ఆ తర్వాత మేకప్ వేసుకోండి. ఇది మన ముఖ చర్మానికి ఓ ప్రొటెక్షన్ షీల్డ్‌గా పనిచేస్తుంది.

మేకప్ లైట్‌గా వేసుకున్నా లేదా ఎక్కువ వేసుకున్నా పైనుంచి పౌడర్ వేసుకోవడం మంచిది. ముఖంపై ఫౌండేషన్, కన్సీలర్ లను ట్రాన్సలూసెంట్‌ పౌడర్ సెట్ చేస్తుంది. ఇది ఎండకాలం కాదు ఏ కాలంలో మేకప్ వేసుకున్నా పైనుంచి సెట్‌ చేయాలి.

ఇదీ చదవండి: మనీప్లాంట్‌ను ఇలా గాజు బాటిల్లో సులభంగా పెంచుకోండి..

మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మేకప్ వేసుకున్న ప్రతిసారి ముఖానికి ముందుగా ప్రైమర్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి త్వరగా మేకప్ జిడ్డుగా మారిపోతుంది. అందుకే వీరు కచ్చితంగా ప్రైమర్ వేసుకోవాలి. ఆ తర్వాతే ఫౌండేషన్ వేయండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News