Dieting Food For Weight Loss: ప్రస్తుతం బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుగా మారింది. అయితే చాలా మంది బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఈ క్రమంలో వ్యాయామాలు చేస్తే, మరికొందరు డైట్ పద్దతిలో ఆహారాలు తీసుకుంటారు. డైటింగ్ చేయడం వల్ల బరువు తగ్గొచ్చు. కాని చాలా మంది ఈ బరువు తగ్గిన వెంటనే డైటింగ్ మానుకుంటున్నారు. దీని వల్ల డైటింగ్ చేయడం వల్ల 2 కిలోల బరువు తగ్గితే, దానిని మానుకోవడం వల్ల 5 నుంచి 6కిలోల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.అయితే డైట్ పద్ధతులను అనుసరించే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
డైట్ చేసే క్రమంలో తప్పకుండా వీటిని పాటించాల్సి ఉంటుంది:
1. రక్త పరీక్ష చేయించుకోండి:
డైటింగ్ ప్రారంభించడానికి మొదట రక్త పరీక్ష చేయించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రక్త పరీక్ష చేయించుకోవడం వల్ల శరీరంలో మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్, విటమిన్ డి, విటమిన్ బి12 ఏయే స్థాయిల్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీంతో మీరు డైట్‌ను అనుసరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2. డైటీషియన్ సలహా తీసువాల్సి ఉంటుంది:
డైట్ ప్రారంభించే ముందు డైటీషియన్‌ను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచించే జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆహారపు విధానాలలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
3. మానసికంగా దృఢంగా ఉండాలి:
ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. శ్రద్ధ మొత్తం డైట్లో పాటించే ఆహార నియమాలపై పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యం ఉండడం కూడా చాలా మంచిది.
4. ప్లాన్ బిని సిద్ధం చేయండి:
కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మనం డైట్‌కి కట్టుబడి ఉండలేకపోతాం. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ ప్లాన్ Bని సిద్ధంగా ఉంచుకోవాలి. చీట్ డేస్, చీట్ మీల్స్ ప్లాన్ చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook