Carrot Juice Benefits In Telugu: రోజు క్యారెట్ రసం తాగుతున్నారా? రోజు తాగడం ఎంత వరకు మంచిది? ప్రతి రోజు క్యారెట్ రసం తాగడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజు ఈ రసం తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి సమస్యల నుంచి విముక్తి లభించి.. సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే క్యారెట్ రసం తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
క్యారెట్ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
కంటి చూపు మెరుగు:
క్యారెట్ రసం తాగడం వల్ల శరీరానికి ఎక్కువ మోతాదులో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి, రే చికటి సమస్యను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కలుగుతాయి.
చర్మం ఆరోగ్యం:
క్యారెట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి రోజు తాగితే చర్మం మృదువు తయారు కావడమే కాకుండా ప్రకాశవంతంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ముడతలు లేని చర్మంలా మారుతుంది. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగాల్సి ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరడానికి:
క్యారెట్ రసంలో అధిక మోతాదులో విటమిన్ సితో పాటు వివిధ రకాల విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి ఈ రసం రోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణ వ్యవస్థ:
క్యారెట్ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా చేయడమే కాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. ఈ రసం పొట్టను హాయిగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
కాలేయ సమస్యలకు చెక్:
క్యారెట్ రసంలోని లభించే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ కె ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.