Valentines Day 2025: ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులతోపాటు కొందరు గుర్తుకు వస్తారు. వారే హిందూ సంఘాలు. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించే కొన్ని హిందూ సంఘాలు ఫిబ్రవరి 14వ తేదీన జరిగే వాలంటైన్స్ డేను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. లవర్స్ డే అనే పేరుతో బహిరంగ ప్రదేశాల్లో.. ఆరుబయట విచ్చలవిడిగా జంటలు చేసే వికృత చేష్టలను ఆయా సంఘాలు వ్యతిరేకిస్తుంటాయి. తాజాగా శుక్రవారం వచ్చిన ప్రేమికుల దినోత్సవంపై కూడా ఆ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. లవర్స్ డేను వ్యతిరేకిస్తూ అమరవీరులను స్మరించుకుందామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి.
Also Read: Back To KCR: బీఆర్‌ఎస్ పార్టీ @ 25 ఏళ్లు.. 19న మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?
వాలంటైన్స్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని వీహెచ్‌పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ప్రతినిధులు మాట్లాడారు. వాలంటైన్స్ డేపై కీలక ప్రకటన చేశారు. 'సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో వాలెంటెన్స్ డే వంటి అపవిత్ర కార్యక్రమాలకు తావులేదు' అని వీహెచ్‌పీ నాయకులు స్పష్టం చేశారు. లవర్స్ డే పేరుతో యువత స్పృహను కోల్పోయి వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Rishabh Pant: లవర్స్ డే ముందు పంత్‌కు భారీ షాక్.. ప్రాణాలు కాపాడిన వ్యక్తి లవర్‌తో ఆత్మహత్యాయత్నం
రాధాకృష్ణుల ప్రేమ ఆదర్శం
భారతీయ జీవన విధానం, కుటుంబ విలువలను కాపాడుకుంటూ.. అన్యోన్యమైన దాంపత్య జీవితం గడపాలని ఈ సందర్భంగా ప్రేమ జంటలకు వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ సూచించింది. రాధాకృష్ణుల ప్రేమను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రేమికులకు హిందూ సంఘాల నాయకులు సూచించారు. విలువలతో కూడిన కుటుంబ జీవనం సాగాలంటే.. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు తమ పిల్లలపై నిఘా పెట్టాలని చెప్పారు. పబ్, డ్రగ్ సంస్కృతి విషయంలో పోలీసులు, డ్రగ్స్ నియంత్రణ అధికారులు, ఇతర యంత్రాంగం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతను మత్తు నుంచి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
అమరవీరులను స్మరించుకుందాం
'ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలెంటెన్స్ డే మాత్రమే కాదు.. దేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం' అని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ గుర్తుచేశారు. వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14వ తేదీని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అమరవీరుల సంస్కరణ దివాస్ పోస్టర్‌లను ఆ సంఘాల నాయకులు విడుదల చేశారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్లు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.