Banana Face Mask: అరటిపండును బ్యూటీ రొటీన్ లో ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు మెండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. అంతేకాదు ఇది ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు. అరటి పండు బ్యూటీ రొటీన్ లో చేర్చుకుంటే ప్రీ రాడికల్స్ సమస్య నుంచి బయటపడతారు. అరటి పండుతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల నమ్మలేని అద్భుత ప్రయోజనాలు పొందుతారు. దీనితో మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.
ముఖ్యంగా అరటి పండులో మాయిశ్చరై జింగ్ గుణాలు ఉండటం వల్ల ఇది వేలల్లో పెట్టి క్రీములకు దీటుగా పనిచేస్తుంది. అరటిపండులో ఫాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని టైట్ గా మార్చి వృద్ధాప్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. అరటిపండుతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల మీ చర్మం పీహెచ్ స్తాయిలు కూడా అదుపులో ఉంటాయి. అరటి పండులో 70% వరకు నీరు ఉంటుంది.. ఇది మంచి హైడ్రేటింగ్ గుణాలు కలిగి ఉంటుంది. చర్మానికి కూలింగ్ ఏజెంట్ల పని చేస్తుంది. అరటి పండుతో వేసుకునే మార్కు వల్ల చర్మం తక్షణ కాంతి పొందుతుంది.
అరటి పండులో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఇది మంచి మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల యాక్నే రాకుండా నివారిస్తుంది. మీ ముఖంపై మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. మీ చర్మానికి ఎగ్జిమా, సోరియాసిస్ రాకుండా నివారిస్తుంది, అరటిపండుతో మెరిసే స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.
అరటి పండు స్క్రబ్ తయారు చేసుకోవడానికి ఒక పండిన అరటిపండు మ్యాష్ చేసి అందులో చక్కెర వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంతోపాటు చర్మానికి కూడా స్క్రబ్ చేసుకోవచ్చు.. ఆ తర్వాత సాధారణ సబ్బుతో క్లీన్ చేసుకుంటే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.
ఇదీ చదవండి: Guava Leaves: జీరో బడ్జెట్ లైఫ్‌స్టైల్.. ఈ ఆకు మీ ఇంట్లో ఉంటే 100 రోగాలు పరార్..!
అరటిపండుల ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఒక అరటిపండును తీసుకొని మ్యాష్ చేసి అందులో ఫ్యాట్ మిల్క్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఇందులో కాస్త శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఇది ముఖం చేతులకు బాగా అప్లై చేసుకోవాలి మంచి పోషణ అందిస్తుంది.
అరటి పండుతో మాయిశ్చరైసర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. అరటిపండును తీసుకొని దాన్ని బ్లెండ్ చేసి ఇందులో తేనె, కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి మాయిశ్చర్ అందిస్తుంది చర్మం చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: Rose Water: ఈ నీరు ఉంటే చాలు.. ఏ ఫేస్ క్రీముల అవసరం ఉండదు..
అరటిపండు వెనీల ఎసెన్స్ కూడా చర్మానికి మంచి గ్లోయింగ్స్ పొందుతారు. అరటిపండు షుగర్ పొడి వెనీలా ఎసెన్స్ కలిపి బ్లెండ్ చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చేసుకోవాలి .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.