Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament monsoon sessions) ప్రారంభమవుతూనే రాజ్యసభలో గందరగోళం చోటుచేసుకుంది. కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతుండగానే.. ప్రధాని మోదీ (Pm Narendra modi)ప్రసంగం సాగింది. కేబినెట్‌లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభ పరిణామమన్నారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల్ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపధ్యంలో విపక్షాల ఆందోళన అధికమవడంతో లోక్‌సభ(Loksabha) మద్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
మరోవైపు పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ, వ్యాక్సినేషన్, ఆర్ధిక వృద్ధి పతనం అంశాలపై టీఎంసీ (TMC)పార్టీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలవరం(Polavaram)అంచనా వ్యయం ఆమోదం కోరుతూ సభలో వాయిదా తీర్మానం పెట్టింది. అంతేకాకుండా ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party)నోటీసు జారీ చేసింది. రూల్ 267 కింద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోటీసు అందించారు. ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని..రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మోదీ ఏపీకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీకు ప్రత్యేక హోదాపై 2014లో కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఇప్పటికే ఏడేళ్లైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా(Ap special status) హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు పార్లమెంట్ వద్ద రైతు చట్టాలకు వ్యతిరేకంగా అకాళీదళ్ ఎంపీలు నిరసన తెలిపారు.
Also read: India Corona Update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు, వెంటాడుతున్న కరోనా థర్డ్‌వేవ్ భయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook