UP Exit Poll Results 2022 : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్‌గా పరిగణిస్తుండటంతో ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం కావడంతో ఉత్తరప్రదేశ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ :
బీజేపీ, దాని మిత్రపక్షాలకు 241 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 150 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 6 స్థానాలు, కాంగ్రెస్‌కు 2 స్థానాలు ఇతరులకు 4 స్థానాలు దక్కుతాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ :
బీజేపీ, దాని మిత్రపక్షాలకు 288-326 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 71-101 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 3-9 స్థానాలు, కాంగ్రెస్ 1-4 స్థానాలు దక్కుతాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ :
బీజేపీ, దాని మిత్రపక్షాలకు 240 పైచిలుకు స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 140 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 17 స్థానాలు, కాంగ్రెస్‌కు 4 స్థానాలు, ఇతరులకు 2 స్థానాలు దక్కుతాయని పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్ :
బీజేపీ, దాని మిత్రపక్షాలకు 225 పైచిలుకు స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 151 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 14 స్థానాలు, కాంగ్రెస్‌కు 9 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
న్యూఎక్స్-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ :
బీజేపీ, దాని మిత్రపక్షాలకు 211-225 పైచిలుకు స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 146-160 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 14-24 స్థానాలు దక్కుతాయని న్యూఎక్స్-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 312 సీట్లలో గెలుపొందింది. కానీ ఈసారి బీజేపీకి సీట్లు తగ్గొచ్చునని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి ఈసారి 300 లోపు సీట్లే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Also Read: AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్... సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ సర్కార్..
Also Read: Bheemla Nayak: చిత్తూరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాక్... జంతు బలి కేసు నమోదు చేసిన పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook