Latest News Highlights: మళ్లీ లాక్​డౌన్​, ఎన్నికలొస్తే ఎవరిది అధికారంలాంటి ప్రధాన వార్తల సమాచారం

Latest Top News : తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​ వార్త నుంచి దేశంలో ఎన్నికలొస్తే ఎవరిది అధికారం లాంటి తదితర వార్తల సమగ్ర సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 02:12 AM IST
  • తాజాగా జీ న్యూస్‌లో వచ్చిన వార్తల్లో కొన్ని ఇదిగో...
  • తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​
  • ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరిది అధికారం
  • ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌.. తదితర వార్తల సమగ్ర సమాచారం
Latest News Highlights: మళ్లీ లాక్​డౌన్​, ఎన్నికలొస్తే ఎవరిది అధికారంలాంటి ప్రధాన వార్తల సమాచారం

Zee News Latest News Headlines : తాజాగా జీ న్యూస్‌లో వచ్చిన వార్తల్లోని కొన్నింటిపై ఓ లుక్కేయండి. మరోసారి కరోనా కట్టడికి కఠినంగా వ్యవహరించిన తమిళనాడు ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరిది అధికారం, "ఆర్‌ఆర్‌ఆర్‌" మూవీ రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్ తదితర వార్తల సమగ్ర సమాచారం ఇదిగో..

తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​

కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ స్వయంగా ప్రకటించినట్లు ఏఎన్​ఐ పేర్కొంది.

tnlockdown

ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరిది అధికారం

దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు ఇంకా చాలా సమయం మిగిలుంది. 2024లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తుండటంతో ప్రముఖ ఏజెన్సీలు జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్- ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. 

modi-and-jagan

దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలో వస్తుందని..వరుసగా మూడవసారి ప్రదానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నిక కానున్నారని సీ ఓటర్ - ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉంది. ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమంటోంది సీ ఓటర్- ఇండియా టుడే సర్వే. 

 

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌

ఆర్ఆర్‌‌ఆర్ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తు ఉండగా.. గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆర్ఆర్‌‌ఆర్‌‌ (RRR) యూనిట్. కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది మార్చి 18న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను (RRR Movie) విడుదల చేస్తామని ప్రకటించింది. ఒక వేళ ఆ రోజున కుదరని పక్షంలో ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేస్తామని క్లారిటీ ఇచ్చింది.

rrr

ఆస్కార్​ రేసులో సూర్య 'జై భీమ్'​

తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్​ సినిమా మరో ఘతను సాధించింది. ఆస్కార్​ ఎంట్రీకి అర్హతను సాధించిన విదేశీ సినిమాల జాబితాలో జై భీమ్​ కూడా చోటు సంపాదించింది. 94వ ఆస్కార్ ఈవెంట్​ కోసం.. 276 విదేశీ సినిమాలు అర్హత సాధించగా.. అందులో జై భీమ్​ కూడా చేరింది.

jai-bhim

జనవరి 18న.. ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్​లో సిన్​ ఆఫ్​ ది అకాడమిలో జై భీమ్​ వీడియోను పబ్లిష్ చేసింది. భారతతీయ సినిమాకు ఇది కూడా ఓ గొప్ప గౌరవం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27- ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. నామినేషన్స్​ను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు న్యాయ నిర్ణేతలు.

Also Read : YouTube channels Ban: 35 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు- కారణాలివే..

అల్లు అర్జున్ 'పుష్ప' చూసి యువకుడిని చంపిన ముగ్గురు మైనర్లు.. 

inspired-by-allu-arjun-pushpa-movie

ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో ముగ్గురు మైనర్లు ఒక యువకుడిని హత్య చేశారు. పుష్ప, (Pushpa) భౌకాల్‌లాంటి మూవీలు వెబ్‌ సిరీస్‌లు చూశాకా.. తమకు కూడా వాటిలో చేసిన విధంగానే చేయాలనిపించిందని.. వాటిలో గ్యాంగ్‌స్టర్స్‌ (Gangsters) లైఫ్‌స్టైల్‌కు తాము అట్రాక్ట్‌ అయ్యామని ఈ ముగ్గురు మైన్లర్లు పోలీసులకు విచారణలో చెప్పారు.

Also Read : Corona in Telangana: రాష్ట్రంలో కొత్తగా 4,400కు పైగా కరోనా కేసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News