Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

Motorola G85 5G Discount Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి మొబైల్ పొందాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 4, 2024, 11:36 PM IST
Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

Motorola G85 5G Discount Offer: అత్యధిక తగ్గింపు ధరతో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మంచి ప్రీమియం ఫీచర్స్ ఉన్న మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది గోల్డెన్ ఛాన్స్ గా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై 20 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అదనంగా వాటిపై బ్యాంకు డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోటరోలా ఇటీవల విడుదల చేసిన కొన్ని మొబైల్స్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అమెజాన్‌లో ప్రత్యేకమైన కూపన్ ఆఫర్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే  ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక తగ్గింపు ధరతో ఏ మోటోరోలా మొబైల్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

గతంలో మోటోరోలా కంపెనీ విడుదల చేసిన  Motorola G85 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం  ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్ తో పాటు నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ పై  ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి ఏకంగా 19% కు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. మార్కెట్లో దీని అసలు ధర MRP రూ.20,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా ఈ మొబైల్ ని కొనుగోలు చేసే వారికి రూ.16,000 కే పొందవచ్చు. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడానికి కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక ఈ  Motorola G85 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కార్డును వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో దీనిపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోను ఈ మొబైల్ కేవలం రూ.15,999కే లభిస్తుంది. ఇవే కాకుండా ఈ  Motorola G85 5G మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే దాదాపు ఏం లేకున్నా రూ.6,799 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను మొబైల్ ను కేవలం రూ.9,200కే పొందవచ్చు.

ఇదీ చదవండి:  రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..
ఫీచర్స్‌, స్పెషిఫికేష్స్‌:
Qualcomm Snapdragon 730G ఆక్టా-కోర్ ప్రాసెసర్
6.7-ఇంచ్ ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేటు
ట్రిపుల్ రెయర్ కెమెరా సెటప్
64MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
రామ్ & స్టోరేజ్: 6GB/8GB RAM, 128GB స్టోరేజ్ 
5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ
20W టర్బోపవర్ చార్జింగ్
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IP52 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్

ఇదీ చదవండి:  రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News