Covishield Vaccine: దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెద్దఎత్తున పెంచింది. జూన్ నెలలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది.
కరోనా వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ గత కొద్దికాలంగా వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. జూన్ 21న అయితే దేశం మొత్తం మీద 86 లక్షలమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో రికార్డు సృష్టించింది.ఏకంగా 13.72 లక్షలమందికి ఒక్కరోజులో వ్యాక్సిన్ అందించింది. దీనికి కారణం కోవిషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా..తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుకుంది.
సాధారణంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) వ్యాక్సిన్ సామర్ధ్యం నెలకు 5-6 కోట్లు కాగా మే నెలలో అత్యధికంగా 6.5 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది. తరువాత జూన్ నెలలో 9 కోట్ల వరకూ వ్యాక్సిన్ అందిస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ కంటే ఎక్కువగా జూన్ నెలలో ఇప్పటి వరకూ 10.8 కోట్ల కోవిషీల్డ్ (Covishield) డోసుల్ని ఉత్పత్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. జూన్ నెలలో 45 బ్యాచ్‌లలో 10.8 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని హిమాచల్ ప్రదేశ్ కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీకు పంపింది. అక్కడ ప్రతి బ్యాచ్‌ను పరీక్షించిన తరువాత దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. గత ఆరు రోజులుగా ఇండియాలో రోజుకు 69 లక్షల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది.
Also read: SBI New Rules: ఎస్బీఐ ఖాతా ఇక మరింత ప్రియం, అదనపు ఛార్జీల మోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook