Punjab CM Bhagwant Mann Hospitalised: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కడుపునొప్పితో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవారం (జూలై 20) తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పలు టెస్టులు నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచే ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఆసుపత్రిలో ఆయన చేరికను పంజాబ్ ప్రభుత్వ వర్గాలు రహస్యంగా ఉంచాయి. పూర్తి సెక్యూరిటీ లేకుండానే భగవంత్ మాన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.
సీఎం భగవంత్ మాన్ ఇటీవల సుల్తాన్‌పూర్ లోధిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాళీ బెన్ నది ప్రక్షాళన 22వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాళీ బెన్ నది నుంచి స్వయంగా గ్లాసు నీళ్లు తీసుకుని తాగారు. అనంతరం నది ఒడ్డున మొక్కలు నాటారు. కాళీ బెన్ నదిలో నీటిని తాగడం వల్లే భగవంత్ మాన్ అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన ఆ నది నీళ్లు తాగడం వల్లే ఆయనకు కడుపునొప్పి వచ్చినట్లు చెబుతున్నారు. భగవంత్ మాన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య నిందితులైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడాన్ని సీఎం భగవంత్ మాన్ అభినందించారు. ఈ మేరకు బుధవారం (జూలై 20) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్స్, అసాంఘీక శక్తులపై పంజాబ్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని.. ఆ మేరకు అమృత్‌సర్ పోలీసులు నిబద్ధతతో వ్యవహరించి యాంటీ గ్యాంగ్‌స్టర్ ఆపరేషన్‌లో సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే.
Also Read: TV Actress: పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి దుర్మరణం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook