PM Kisan 10th Installment: రైతులకు కేంద్రం గుడ్​ న్యూస్​- పీఎం కిసాన్​ నిధుల విడుదల నేడు!

PM Kisan: దేశ రైతులకు కేంద్రం నుంచి శుభవార్త. 10వ విడత పీఎం కిసాన్​ ఆర్థిక సహాయం నేటి నుంచే అందనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఇవాళ మధ్యహ్నం నిధులు విడుదల చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 09:46 AM IST
  • రైతులకు కేంద్రం న్యూ ఇయర్ కానుక
  • పీఎం కిసాన్​ నిధులు విడుదల చేయనున్న ప్రధాని
  • 10వ విడత కిందా రూ.20 వేల కోట్లకుపైగా కేటాయింపు!
PM Kisan 10th Installment: రైతులకు కేంద్రం గుడ్​ న్యూస్​- పీఎం కిసాన్​ నిధుల విడుదల నేడు!

PM Kisan 10th Installment: దేశ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్​ నిధి (పీఎం కిసాన్) కింద (PM Kisan Yojana) రైతులకు 10 విడత సహాయాన్ని అందించనుంది.

ఈ మేరకు నేడు (2022 జనవరి 1) మధ్యాహ్నం 12:30 గంటలకు వీడయో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పీఎం కిసాన్​ నిధులను విడుదల (PM Kisan Samman Nidhi Scheme) చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొనున్నారు.

10 కోట్ల మంది రైతులకు లబ్ధి..

10వ విడతలో రూ.20,000 కోట్లకుపైగా నిధులను విడుదల (PM Kisan Yojana10th instalment) చేయనుంది కేంద్రం. మొత్తం 10 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనుంది.

పీఎం కిసాన్​ పథకం గురించి..

రైతులు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.6 వేలు ఇచ్చేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. రూ.6 వేలను మూడు వాయిదాల్లో (రూ. 2 వేల చొప్పున) రైతుల ఖాతాల్లో (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) జమ చేస్తోంది. ఇప్పటి వరకు 9 వాయిదాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పదవ విడత వాయిదా చెల్లించేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ.1.58 లక్షల కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. ఈ పథకం ద్వారా 11.37 కోట్ల మంది రైతులు లబ్దిపొందుతున్నారు.

అందరికీ రూ.2 వేలు.. వారికి మాత్రం రూ.4 వేలు..

పీఎం కిసాన్ సహాయం కింద ప్రతి విడతలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. అయితే చివరి విడతలో వివిధ కారణాలతో కొంత మంది ఈ సహాయాన్ని అందుకోలేకపోయారు. అలాంటి వారిని గుర్తించి వారి ఖాతాల్లో ఈ సారి రూ.4 వేలు జమ చేయనుందని తెలిసింది.

కేంద్రం అందించే ఈ సహయాన్ని పీఎం కిసాన్​ వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వడం ద్వారా మీ వివరాలు సమర్పించి తెలుసుకోవచ్చు.

Also read: Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!

Also read: GST: చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా:. స్పష్టం చేసిన కేంద్రం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News