Post office savings account: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2021, 04:43 PM IST
  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఎకౌంట్‌లో కనీసం ఎంత బ్యాలెన్స్ (Minimum balance amount in postal savings accounts) మెయింటెన్ చేయాలి ?
  • ఇప్పటి వరకు ఉన్న మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ (Minimum balance reduced) మొత్తాన్ని 50 శాతానికి తగ్గించిన కేంద్ర ఆర్థిక శాఖ.
  • సైలెంట్ ఖాతాలకు వర్తించనున్న Minimum balance rule. అసలు సైలెంట్ ఖాతాలు అంటే ఏంటి ?
Post office savings account: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది. 

పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో డబ్బు పొదుపు చేసుకునే వారు మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ (Post office savings account minimum balance amount) కింద రూ. 500 మొత్తాన్ని ఎప్పుడూ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివర్లోగా ఆ మొత్తం పొదుపు ఖాతాలో లేనట్టయితే, వారిపై రూ. 100 పెనాల్టీ చార్జీలు విధిస్తారు. అలా జరిమానా విధించిన కారణంగా ఖాతా పూర్తిగా ఖాళీ అయినట్టయితే.. ఆ ఖాతాను పూర్తిగా మూసేస్తారు.

అయితే, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఓ నోటిఫికేషన్ ప్రకారం.. ఇకపై మినిమం బ్యాలెన్స్ పెనాల్జీ చార్జీల కింద రూ.100 కాకుండా జీఎస్టీతో కలిపి రూ. 50 మాత్రమే (Including GST) వసూలు చేయనున్నారు.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఎకౌంట్ స్కీమ్ 2019 నిబంధనల సవరణల్లో (Post Office Savings Account Scheme 2019 rules) భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

Also read : EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి

ఒకవేళ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయని కారణంగా విధించిన పెనాల్టీ వల్ల పొదుపు ఖాతా ఖాళీ అయినట్టయితే.. ఆ ఖాతాను పూర్తిగా మూసివేస్తారు. అంతేకాకుండా మినిమం బ్యాలెన్స్ లేని పొదుపు ఖాతాలపై వడ్డీ (Interest on post office savings schemes) కూడా చెల్లించరు. 

సైలెంట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఎకౌంట్స్‌లోనూ మినిమం బ్యాలెన్స్ లేనట్టయితే.. వాటిపై కూడా మినిమం బ్యాలెన్స్ జరిమానా విధించనున్నట్టు ఇండియా పోస్ట్ (India post) వెల్లడించింది.

సైలెంట్ ఎకౌంట్స్ అంటే..
సైలెంట్ ఎకౌంట్స్ అంటే.. వరుసగా రెండు, లేదా మూడేళ్లపాటు పొదుపు ఖాతాలో (Savings account) డిపాజిట్స్ కానీ లేదా విత్‌డ్రాయల్స్ కానీ జరగని ఖాతాలను సైలెంట్ ఎకౌంట్స్ అంటారు.

Also read: Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్, తొలి రోజు నుంచే సేవలకు అంతరాయం

బ్యాంకింగ్ సెక్టార్‌లో అత్యధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్న బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ (SBI minimum balance amount) విషయానికొస్తే.. ఎస్బీఐలో గతంలో ఉన్న నెలసరి మినిమం బ్యాలెన్స్ ఎమౌంట్‌ని ఆ బ్యాంకు గతేడాది మార్చి నెలలో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News