Omicron threat to maharashtra : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తిపై అనేక భయాలు, సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ అత్యధిక జెనెటిక్ మ్యుటేషన్లు కలిగి ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైతే ఒమిక్రాన్‌తో మరణం సంభవించిన దాఖలా లేదు. అయితే ఒమిక్రాన్ స్వభావంపై (Omicron symptoms) సరైన అంచనా లేకపోవడంతో.. అది ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి తిరిగొచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలడం మహారాష్ట్రను (Maharashtra) టెన్షన్ పెడుతోంది.
ఒమిక్రాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా (Covid 19 Positive) నిర్దారణ అయిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం (డిసెంబర్ 1) ఉదయం వెల్లడించింది. ఆరుగురిలో ముగ్గురిని ముంబైలోని (Mumbai) కల్యాణ్-దోంబివాలీ, మీరా భయందర్ ప్రాంతాల్లో గుర్తించినట్లు పేర్కొంది. నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరిని పింప్రి చించ్వాడ్‌లో, మరో వ్యక్తిని పుణేలో గుర్తించినట్లు తెలిపింది. ఆ ఆరుగురిలో ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని... అందరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించింది. వారి రిపోర్ట్స్‌లో ఏం తేలుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ఇక నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ఒమిక్రాన్ (Omicron) రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు, క్వారెంటైన్ (Quarantine) నిబంధనలు అమలుచేయనున్నారు. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆ ప్రయాణికులు ఎయిర్‌పోర్టును వీడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా, బోత్సువానా, బ్రెజిల్, బ్రిటన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, న్యూజిలాండ్, సింగపూర్, హాంకాంగ్ , ఇజ్రాయెల్, యూరోప్ దేశాలను భారత్ రిస్క్ కంట్రీస్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు ప్రైవట్ హోటల్స్‌లో తమ సొంత ఖర్చులతో క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. క్వారెంటైన్‌లో ఉన్న రెండో రోజు, నాలుగో రోజు, ఏడో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు (COVID 19 tests) చేయించుకోవాల్సి ఉంటుంది. టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఒకవేళ మళ్లీ పాజిటివ్ వస్తే మరో రెండు వారాలు క్వారెంటైన్ తప్పదు.
Also Read: Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రిరిస్ట్‌ల హతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook