Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం భద్రతా దళాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు మరణించారు. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతాదళాలు, నక్సలైట్లకు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..గురువారం ఉదయం 9గంటలకు ఆ ప్రాంతంలో పూజారీ కాంకేరర్, మారేడుబాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు భారీస్థాయిలో యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లా పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ కు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
Also Read: SIP: మ్యూచువల్ ఫండ్ సిప్‌లో రూ. 5000 లేదా రూ. 10,000లతో కోటి సంపాదించాలంటే ఎన్నేళ్లు పడుతుంది..?
వారంతా అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. వారికి నక్సలైట్లు ఎదురుపడటంతో పరస్పరం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నందున మరింత సమాచారం అందాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.