Karnataka Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఓ వైపు అభ్యర్థులు ప్రచారంలో ముగిని తేలుతుండగా.. తాజాగా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఎన్నికలకు మరో 10 రోజులే సమయం ఉండడంతో మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహా రచన చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ప్రజాధ్వని పేరుతో సోమవారం మేనిఫెస్టోను విడుదల చేశారు. పేదల సంక్షేమానికి మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కర్ణాటకలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీపీఎల్ కార్డుదారులకు మూడు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. ప్రతి వార్డులో అటల్ ఆహార్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. పోషణ్ స్కీమ్ కింద ప్రతి బీపీఎల్ కార్డుదారు కుటుంబానికి అరలీటర్ నందిని పాలు అందజేస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే మేనిఫెస్టోలో అనేక హామీలను చేర్చింది. అన్నదాతలకు సాగు మొదలుపెట్టే సమయంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు విత్తనాల కోసం రూ.10 వేలు సాయం అందించనుంది. సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. బీపీఎల్ కుటుంబాలకు ప్రతి రోజు అర లీటర్ పాలు ఉచితంగా అందజేయనుంది. పేద కుటుంబాలకు ప్రతి నెలా 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణ ధాన్యాలను ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:
==> రాష్ట్రంలోని పేదలకు 10 లక్షల ఇళ్లు ఇస్తాం.
==> సామాజిక న్యాయ నిధి పథకం కింద ఎస్సీ-ఎస్టీ మహిళలకు ఐదేళ్లపాటు రూ.10 వేల ఎఫ్‌డీ ఇస్తాం.
==> బీపీఎల్ కుటుంబాలకు ప్రతి ఏడాది ఉగాది, వినాయక చవితి, దీపావళి సందర్భంగా అదనంగా మూడు గ్యాస్ సిలిండర్లు
==> మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో సరసమైన ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అటల్ ఆచార్ కేంద్రం ఏర్పాటు
==> పౌష్టికాహార పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు రోజు అర లీటర్ నందిని పాలు, నెలకు ఐదు కిలోల శ్రీ అన్నశ్రీ ధాన్య రేషన్ కిట్ అందజేస్తాం..
==> యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
==> ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం
==> సీనియర్ సిటిజన్లకు ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు
==> రూ.5 లక్షల రుణానికి వడ్డీ లేదు
==> రైతులకు విత్తనాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం
==> కళ్యాణ్ సర్క్యూట్, బన్వాసి సర్క్యూట్, పరశురామ్ సర్క్యూట్, కావేరీ సర్క్యూట్, గంగాపుర సర్క్యూట్‌కు 2500 కోట్లు
==> కోఆర్డినేషన్ స్కీమ్ కింద ఎస్ఎమ్‌ఈలు, ఐటీఐల మధ్య సమన్వయంతో ప్రతిభావంతులైన యువకుల ఉపాధి కోసం డైనమిక్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాం.
==> ప్రభుత్వ ఆసుపత్రులు/ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. మహానగర కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో ల్యాబ్ సౌకర్యంతో నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు
==> బీపీఎల్ కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచుతాం.. ఇతర కుటుంబాలకు రూ.5 లక్షల వరకు కవరేజీని అందజేస్తామని హామీ
==> ఎలక్ట్రిక్ వాహనాలకు హాబ్‌గా కర్ణాటకను తీర్చిదిద్దుతాం. అదనంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. 1,000 స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఇప్పటికే ఉన్న బీఎంటీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం..
==> బెంగళూరు శివార్లలో 'ఈబీ సిటీ' అభివృద్ధి
==> అన్ని గ్రామ పంచాయితీలలో మైక్రో చిల్లింగ్ సౌకర్యాలు, అగ్రో ప్రాసెసింగ్ ప్లాంట్‌ల ఏర్పాటుకు కే అగ్రి ఫండ్ ఏర్పాటు
==> వితంతు పెన్షన్ నెలకు రూ.800 నుంచి 2 వేల రూపాయలకు పెంచుతామని హామీ
Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?
Also Read: MI Vs RR Highlights: రోహిత్ శర్మకు అన్యాయం.. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook