International Yoga Day 2022: యోగాతో విశ్వ శాంతి.. మైసూర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...

యోగా ద్వారా మనిషికి శాంతి చేకూరుతుందని రుషులు, మహర్షులు, ఆచార్యులు చెప్పారని మోదీ పేర్కొన్నారు. అది కేవలం వ్యక్తులకే పరిమితం కాదని.. సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, ఈ మొత్తం విశ్వానికి శాంతిని చేకూరుస్తుందని అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 07:36 AM IST
  • ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం
  • మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మోదీ
  • యోగ ఒక జీవన మార్గమని పేర్కొన్న మోదీ
International Yoga Day 2022: యోగాతో విశ్వ శాంతి.. మైసూర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...

International Yoga Day 2022: ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్‌లో గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ...  ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి యోగా ఒక మార్గాన్ని ఇస్తోందన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలకు యోగా విస్తరించిందని.. కరోనా కాలంలోనూ ఆరోగ్యాన్ని పెంపొందించే దిశను చూపించిందన్నారు. ఈసారి యోగా దినోత్సవాన్ని 'యోగా ఫర్ హ్యుమానిటీ' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని దేశాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

యోగా ద్వారా మనిషికి శాంతి చేకూరుతుందని రుషులు, మహర్షులు, ఆచార్యులు చెప్పారని మోదీ పేర్కొన్నారు. అది కేవలం వ్యక్తులకే పరిమితం కాదని.. సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, ఈ మొత్తం విశ్వానికి శాంతిని చేకూరుస్తుందని అన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు యోగా అంటే ఇళ్లకు పరిమితం అని.. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యోగా ఆచరిస్తున్నాయని పేర్కొన్నారు. యోగా ప్రజలను, దేశాన్ని కనెక్ట్ చేస్తుందన్నారు.

యోగా జీవితంలో ఒక భాగం మాత్రమే కాదని.. అదొక జీవన మార్గమని మోదీ పేర్కొన్నారు. సూర్యోదయాన్ని అనుసరించి ప్రపంచ దేశాలన్నీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాయన్నారు. గార్డియన్ రింగ్ పద్దతిలో సూర్యుడి తొలి కిరణంతో యోగా సాధన ప్రారంభమవుతుందన్నారు. ఇది తూర్పు దిక్కుతో మొదలై క్రమంగా పశ్చిమం వైపుగా చేరుతుందన్నారు. ప్రతీ ఒక్కరు యోగా గురించి తెలుసుకోవాలి.. యోగాను ఆచరించాలని పిలుపునిచ్చారు. 

కాగా, మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ వేడుకల్లో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు. వీరందరితో కలిసి మోదీ యోగాసనాలు వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దాదాపు 25 కోట్ల మంది యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నట్లు చెబుతున్నారు.

Also Read: Horoscope Today June 21st: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించే ప్రమాదం..  

Also Read: BREAKING: Basara IIIT Students: బాసర త్రిపుల్ ఐటికి మంత్రి సబిత.. సమ్మె విరమించినట్టు ప్రకటించిన విద్యార్థులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News