Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేలో 35 వేల ఉద్యోగాలు

35281 Posts In Indian Railways: ఒకేసారి అన్ని స్థాయిల పరీక్షల ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు, అమితాబ్ శర్మ స్పందిస్తూ, " ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల చేయడం వల్ల, చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారు " అని అన్నారు.

Written by - Pavan | Last Updated : Nov 18, 2022, 06:32 PM IST
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే
  • ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల జాతర
  • 35,281 ఖాళీల భర్తీకి రైల్వే శాఖ కసరత్తు
Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేలో 35 వేల ఉద్యోగాలు

35281 Posts In Indian Railways: రైల్వే ఉద్యోగాల కోసం వేచిచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేలో 35,000 ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంతేకాదు.. ఈసారి ఖాళీల భర్తీలో ఎలాంటి జాప్యం లేకుండా  మార్చి 2023 చివరి నాటికి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. "మార్చి 2023 నాటికి, మొత్తం 35,281 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఈ నియామకాలన్నీ CEN (సెంట్రలైడ్జ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్) 2019 ఆధారంగా ఉంటాయి" అని ఇండియన్ రైల్వేలో ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ తెలిపారు.

"రైల్వే శాఖలోని అన్ని స్థాయిల ఫలితాలను విడివిడిగా విడుదల చేసేలా సన్నాహాలు చేస్తోందని.. ఫలితంగా ఎక్కువ మంది ఔత్సాహికులు ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది " అని అమితాబ్ శర్మ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపారు.

ఒకేసారి అన్ని స్థాయిల పరీక్షల ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు, అమితాబ్ శర్మ స్పందిస్తూ, " ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల చేయడం వల్ల, చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారు " అని అన్నారు. ఒకే పరీక్ష ఫలితం విధానంతో ఒకే దరఖాస్తుదారు వేర్వేరు పోస్టులకు అర్హత పొందుతున్నారని.. ఆ కారణంగా చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలు కోల్పోతున్నారని తెలిపారు. అలా కాకుండా అన్ని స్థాయిల ఫలితాలను విడివిడిగా వెల్లడించడం ద్వారా ఎక్కువ మంది ఔత్సాహికులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గం సుగుమం అవుతుందని అమితాబ్ శర్మ పేర్కొన్నారు.

కోవిడ్ కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, రైల్వే పరీక్షల నిర్వహణ, సకాలంలో ఫలితాల వెల్లడించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోందని అమితాబ్ శర్మ.. ఏదేమైనా "మార్చి 2023 నాటికి, మొత్తం 35,281 పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోందని అన్నారు.

Also Read : 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు.. భారీగా పెరగనున్న జీతాలు..!

Also Read : PMKMY: నెలకు రూ. 55 పెట్టుబడితో నెలకు 3 వేల రూపాయల పెన్షన్ వచ్చే మార్గం

Also Read : Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News