Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు.. 1100లకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో గురువారం ( సెప్టెంబరు 17న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 96,424 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,14,678 కి పెరగగా.. మరణాల సంఖ్య 84,372 కి చేరింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,17,754 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 41,12,552 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 10,06,615 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 17 వరకు మొత్తం 6,15,72,343 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం