స్టార్టప్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు చర్యలు: మోదీ

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Last Updated : Jun 6, 2018, 04:34 PM IST
స్టార్టప్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు చర్యలు: మోదీ

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్టార్టప్‌లు కేవలం పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

 

స్టార్టప్‌ ఇండియా విజయవంతమైన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యువ పారిశ్రామికవేత్తలతో మోదీ ముఖాముఖీ సంభాషించారు. యువత అనేక నూతన ఆవిష్కరణలకు సంబంధించిన అద్భుతమైన ఆలోచనలు చేస్తోందన్నారు. యువత తమ స్టార్టప్‌లను ప్రారంభించడానికి నిధుల లేమిని ఎదుర్కొనకుండా ఉండటానికి ప్రభుత్వం 'ఫండ్‌ ఆఫ్ ఫండ్స్‌' ను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామాలు, పట్టణాలకు స్టార్టప్స్ విస్తరిస్తున్నాయని.. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

 

Trending News