విడిపోయిన ఐఎఎస్ టాపర్స్ జంట...టీనాదబీ, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌లకు విడాకులు!

IAS Couple divorce: ఐఏఎస్‌ టాపర్స్‌ జంట టీనా దాబి, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌ విడిపోయారు. జైపూర్‌లోని  ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2021, 03:09 PM IST
  • విడిపోయిన ఐఎఎస్ టాపర్స్ జంట
  • టీనాదబీ, అధర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరు
  • ఇష్టపూర్వకంగానే నిర్ణయం
విడిపోయిన ఐఎఎస్ టాపర్స్ జంట...టీనాదబీ, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌లకు విడాకులు!

Tina Dabi, Athar Khan divorce: వారిద్దరూ ఐఏఎస్ టాప్ ర్యాంకర్లు. 2015 బ్యాచ్ కు చెందినవారు. మతాలు వేరైనా ఇద్దరూ ప్రేమించున్నారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో  వీరి పెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పడు మరోసారి ఆ జంట విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. వారే ఐఏఏస్ లు టీనా దాబి, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌.

టీనా దాబి(Tina Dabi) ఓ ద‌ళిత విద్యార్థిని. 2015 యూపీఎస్సీ(UPSC) ప‌రీక్ష‌లో ఆమె టాప్ ర్యాంక్ సాధించ‌డంతో అప్ప‌ట్లో పెను సంచలనం. అదే ఏడాది జమ్మూకాశ్మీర్‌కు చెందిన అధర్‌ ఆమిర్‌ ఖాన్‌(Athar Aamir Khan) రెండో ర్యాంక్‌ సాధించాడు. అయితే.. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐఏఎస్(IAS) అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయినా వారు వెనకడుగు వేయకుండా పెళ్లి చేసుకున్నారు. 

Also Read: నీట్ 2021 దరఖాస్తు: నీట్ పరీక్ష తేదీ, సమయం, ప్యాటర్న్ వివరాలు

వీరి వెడ్డింగ్ రిష‌ప్ష‌న్‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి(Vice President Venkaiah Naidu)తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు, అప్ప‌టి స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ హాజ‌ర‌య్యారు. దీంతో ఆ వివాహం అంద‌ర్నీ ఆక‌ర్షించింది. ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించిన ఈ జంట.. ఏమైందో ఏమోగానీ విడాకుల కోసం జైపూర్‌(jaipur)లోని ఫ్యామిలీ కోర్టు(Family Court)ను ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ మంగళవారం విడాకులు మంజూరు చేసింది.

మెుదట టీనా, అధర్‌ రాజస్థాన్‌(Rajsthan) క్యాడర్‌లో జైపూర్‌లోనే విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీనా అక్కడే ఉండగా.. అధర్‌ మాత్రం డెప్యుటేషన్‌పై తన సొంతరాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌(jammu kashmir) వెళ్లి శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. టీనాది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News