Janhvi Kapoor: సైలెంట్‌గా అన్నంత పనిచేసిన జాన్వీకపూర్..!.. తిరుపతిలో ఎన్ని ఎకరాల భూమి కొనేసిందో తెలుసా..?

Janhvi Kapoor latest news: కొన్ని రోజుల క్రితం జాన్వీకపూర్ పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ అవుతానని, ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమె అన్నంత పనిచేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 

1 /6

దేవర బ్యూటీ జాన్వీకపూర్ తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీకపూర్ తరచుగా తిరుమలకు వెళ్తుంటారు. ఆమెకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తిరుమలకు వెళ్తుంటారు.

2 /6

తిరుమలలోని ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతగానో కట్టిపాడేస్తాయని జాన్వీకపూర్ చెబుతారు. గతంలో జాన్వీకపూర్ తిరుమలలో తన ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ వాళ్లతో తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.

3 /6

ఇదిలా ఉండగా.. ఈ దేవర బ్యూటీ ఇటీవల పెళ్లి చేసుకుని తిరుమలలో సెటిల్ అవ్వాలనుందని, ముగ్గురు పిల్లల్ని కంటానని, వెంకటేశ్వరుడి కీర్తనలు వింటూ హ్యాపీగా జీవితం గడపాలని ఉందని అన్నారు. అంతే కాకుండా.. అరటి ఆకులో భోజనం చేయాలని ఉందని కూడా వ్యాఖ్యలు చేశారు.

4 /6

ఈ క్రమంలో జాన్వీకపూర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడిచిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో జాన్వీ తాజాగా , తిరుమలలో భూమిని కొన్నారని వార్తలు తాజాగా వైరల్గా మారాయి.

5 /6

జాన్వీకపూర్ సైలేంట్ గా తిరుపతిలో కొంత మందిని భూమి విషయంలో ఆరాతీశారంట. అంతే కాకుండా.. ప్రస్తుతానికి ఐదు ఎకరాల భూమి కొనేందుకు జాన్వీకపూర్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారంట. అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేశారంట.  

6 /6

అతి తొందరలో తిరుపతిలో సదరు ఐదుఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రాసేస్ తొందరగా అయ్యేలా చూడాలని కూడా చెప్పారంట. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఏదో మాట వరసకు అనిందేమో అనుకున్నామని.. నిజంగానే జాన్వీకపూర్ భూమిని కొనేసిందా అని నోరెళ్లబెడుతున్నారంట.   ఈ వార్తలు ఎంత వరకు నిజమనేదానిపై జాన్వీకపూర్ పర్సనల్ టీమ్ స్పందిచాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.