DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు 

DA Hike: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 4% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు భారీగా పెరగనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2024, 09:23 AM IST
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు 

DA Hike For Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్(డీఆర్)లను నాలుగు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుండి అమల్లోకి రానుంది. డీఏ 46% నుంచి 50%కి, డీఆర్ 4% పెంచాలని 7 వేతన సంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ అంగీకరించింది. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఈ ఏడాది సర్కారుపై రూ.15014 కోట్ల భారం పడనుంది. అంతేకాకుండా వాహన భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ మొదలైన అలవెన్సులు 25 శాతం పెంచనున్నారు.

ఉద్యోగులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అనే దానిపై ఆధారపడి హౌస్ రెంట్ అలవెన్సు అనేది ఆధారపడి ఉంటుంది.  7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం హెచ్ఆర్ఏ అనేది క్లాస్ ఎక్స్ సిటీలో 27%, క్లాస్ వై సిటీలో 18% శాతం, క్లాస్ జెడ్ సిటీలో 9% నుండి వరుసగా 30%, 20%, 10%కి పెంచారు. అలాగే గ్రాట్యుటీ పరిమితిని 25% పెంచారు. డీఏ మరియు డీఆర్ లో పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి ₹12,869 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 49 లక్షల మంది, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 

Also Read: Maruti Suzuki Celerio: దేశంలో ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే సీఎన్‌జీ కారు ఇదే.. కేవలం 80 రూపాయలకే 35 కి.మీ..!

Also Read: LIC Superhit Scheme: ఒక్కసారే పెట్టుబడి, జీవితకాలం నెలకు 12 వేల పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News