Goa Governor transferred to Meghalaya: న్యూఢిల్లీ: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ ( Satya Pal Malik ) ను మంగళవారం మేఘాలయ ( Meghalaya ) గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్‌ను రాష్ట్రపతి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. Also read: Vande Bharat Mission: ఎయిరిండియా విమానాలపై నిషేధం
అంతకుముందు సత్యపాల్ మాలిక్ కేంద్ర జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్‌గా సేవలందించారు. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసి, ఆయన స్థానంలో గిరిష్ చంద్రముర్మును నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముర్ము కాగ్ చీఫ్‌గా నియమితులయ్యారు. Also read: India: 27 లక్షలు దాటిన కరోనా కేసులు