న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది ( Kamal Nath gets notices from EC ). కమల్ నాథ్ బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిని ( Imarti Devi ) ఉద్దేశించి ‘ఐటమ్’ అని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసి ఈ నోటీసుల్లో పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ( Election code ) అమలులో ఉందని గుర్తుచేసిన ఎన్నికల సంఘం.. పార్టీలు, వ్యక్తులు, కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా, ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేసింది. Also read : Naini Narsimha Reddy's death: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతి
మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ( MP by elections ) నేపథ్యంలో గ్వాలియర్‌లోని డాబ్రా నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొన్న కమల్ నాథ్.. అక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఇమర్తి దేవిపై ( Imarti Devi ) పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమెలా ఒక 'ఐటమ్' కాదని వ్యాఖ్యానించారు. సరిగ్గా కమల్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలే పెను దుమారానికి కారణమయ్యాయి.
కమల్ నాథ్ వ్యాఖ్యలను ( Kamal Nath's Item remarks ) తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్... ఒక మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా బీజేపి అభ్యర్థిని ఐటం అని వ్యాఖ్యానించిన కమల్ నాథ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ( Sonia Gandhi ) ఓ లేఖ రాశారు. ఈ విషయంలో బీజేపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కమల్ నాథ్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అన్నారు. Also read : KKR vs RCB match: ఇరగదీసిన బెంగళూరు బౌలర్స్.. 84 పరుగులే చేసి చిత్తుగా ఓడిన కోల్‌కతా
నవంబర్ 3న మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ( MP Bypolls ) జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో పెద్ద దిక్కుగా ఉన్న కమల్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. కమల్ నాథ్ వైఖరిపై జాతీయ మహిళా కమిషన్ ( NCW ) సైతం కన్నెర్ర చేసింది.
ఐతే కమల్ నాథ్ ( Kamal Nath ) మాత్రం తాను ఇమర్తి దేవిని అగౌరపరచాలనే ఉద్దేశంతో ఆ కామెంట్ చేయలేదని.. అప్పుడు ఆమె పేరు గుర్తుకు రాకపోవడం వల్లే అలా అన్నానని పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. Also read :
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe