మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది ( Kamal Nath gets notices from EC ). బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ ‘ఐటమ్’ అని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసి ఈ నోటీసుల్లో పేర్కొంది.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Kamal Nath Comments against Imarti Devi | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన కమల్‌నాథ్ వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి పేరు గుర్తుకురాలేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.