Rs 2000 Fine for not wearing a mask in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు ( COVID-19 cases) భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. లేకపోతే 2వేలు జరిమానాను విధించనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలను ఈ రోజు జారీ చేస్తామని ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) శుక్రవారం వెల్లడించారు.
Contact tracing is already underway at a large scale. House-to-house survey would be conducted in containment zones from today to check on symptomatic patients. Govt rates will be charged for 60% #COVID19 beds reserved by Delhi govt in private hospitals: Delhi Health Minister https://t.co/UxKEuZbgSm pic.twitter.com/gW9m4J7MBy
— ANI (@ANI) November 20, 2020
ఇంట్లో నుంచి బయకు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ మాస్కును ధరించడం తప్పనిసరి అని.. దానిని ప్రజలు ఒక నియమంగా పాటించాలని సత్యేంద‌్ర జైన్ సూచించారు. కారులో ఉన్నప్పుడు మాస్కు ధరించడం వల్ల ఎలాంటి హానీ జరగదని పేర్కొన్నారు. మాస్కు లేనివారికి విధించే జరిమానాను 500 నుంచి రూ.2 వేలకు పెంచామని, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కంటైన్‌మెంట్ జోన్లలో కరోనా లక్షణాలున్నవారిని గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
అయితే ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో కేటాయించిన 60 శాతం పడకలకు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేస్తారని ఆయన వెల్లడించారు. అయితే తాజా ఉత్తర్వులతో బెడ్ల సంఖ్య పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. Also read: Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి